ఐపీఎల్-2021 మిగిలిన మ్యాచులు యూఏఈలో నిర్వహణ: బీసీసీఐ

BCCI Decida bcci, BCCI Decides to Conduct Remaining Matches of IPL-2021 in UAE, BCCI decides to move IPL 2021 phase 2 to UAE, BCCI SGM Live Updates, BCCI to conduct remainder of IPL 2021 in UAE, BCCI to conduct remaining matches of VIVO IPL in UAE, indian premier league, IPL 2021, IPL 2021 Latest News, IPL 2021 New Schedule, IPL 2021 to Resume, IPL 2021 to Resume in UAE, IPL 2021 Updates, Mango News, Remaining Matches of IPL-2021 in UAEes to Conduct Remaining Matches of IPL-2021 in UAE

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 లో మిగిలిన మ్యాచుల నిర్వహణ విషయంలో భారత్ క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నెలలో దేశంలో రుతుపవనాలను పరిగణనలోకి తీసుకుని వివో ఐపీఎల్-2021 మిగిలిన మ్యాచులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ ) లో నిర్వహించాలని నిర్ణయించింది. శుక్రవారం నాడు వర్చువల్ గా జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో (ఎస్‌జిఎం) ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఐపీఎల్-2021 ను తిరిగి ప్రారంభించడానికి సభ్యులంతా ఏకగ్రీవంగా అంగీకరించారని పేర్కొన్నారు.

ముందుగా ఐపీఎల్-2021 లో భాగంగా పలు జట్ల ఆటగాళ్లు కరోనా వైరస్ బారినపడడంతో మిగిలిన ఐపీఎల్‌ మ్యాచ్‌లను నిరవధికంగా వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 29 మ్యాచులు పూర్తికాగా, మిగిలిన 31 మ్యాచులు యూఏఈ లో నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు. కాగా యూఏఈలో సెప్టెంబర్ 18 మరియు అక్టోబర్ 10 మధ్య ఐపీఎల్ జరిగే అవకాశమునట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలును త్వరలోనే ప్రకటించనున్నారు. మరోవైపు ఐసీసీ టీ20 ప్రపంచ కప్-2021 నిర్వహణపై నిర్ణయం తీసుకునేందుకు ఐసీసీ నుండి సమయం పొడిగింపు కోరేందుకు ఆఫీస్ బేరర్‌లకు అధికారం ఇస్తూ బీసీసీఐ ఎస్‌జిఎంలో నిర్ణయించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here