రాహుల్ జోడోయాత్ర మళ్లీ ప్రారంభం..

Bharat Nyay Yatra Rahuls Jodoyatra Starts Again, Bharat Nyay Yatra, Rahuls Jodoyatra Starts, Jodoyatra Starts Again, Jodoyatra, Bharat Nyay Yatra, Rahuls Jodoyatra Starts Again, Rahul Jodoyatra, Rahul Bharat Nyay Yatra, Latest Rahuls Jodoyatra News Update, Jodoyatra News, Rahul Gandhi, Congress, Sonia Gandhi, Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
Bharat Nyay Yatra, Rahul's jodoyatra starts again, Rahul jodoyatra, Rahul Bharat Nyay Yatra

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అన్ని వర్గాల నుంచి ఇప్పుడు అంత క్రేజ్ వచ్చిందంటే దానికి  కారణం రాహుల్ భారత్ జోడోయాత్ర అంటే ఎవరూ కాదనలేరు. రాహుల్ ఎలా ఉంటారో అలాగే ప్రజల మధ్య ఉండటం, వారి పర్సనల్ విషయాలను కూడా పంచుకుంటూ వారితో మమేకం అవడం, చిన్నవాళ్లు, పెద్దవాళ్లు అనే తేడా లేకుండా అందరితో కలిసిపోవడం ఇవన్నీ చూసిన ప్రజలు రాహుల్ గాంధీని ఓన్ చేసేసుకున్నారు. అన్ని రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటోంది అంటే రాహుల్ జోడో యాత్ర ప్రభావమేనని కాంగ్రెస్ అధిష్టానం కూడా నమ్ముతోంది.

అందుకే 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు  రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర చేయనున్నారు. బీజేపీని గద్దె దించాలని.. కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది.  దీనిలో భాగంగానే జనవరి 14 నుంచి రాహుల్ గాంధీ  భారత్ జోడో యాత్ర రెండో ఎడిషన్‌ను ప్రారంభించనున్నారు. అయితే ఈ సారి భారత్ జోడో యాత్రగా కాకుండా..భారత్ న్యాయ్ యాత్రగా ప్రజల ముందుకు రాబోతోంది. ఈ  భారత్ న్యాయ్ యాత్ర దేశంలోని తూర్పు నుంచి  పడమర వరకు సాగుతుంది.అంటే ఈశాన్య ప్రాంతంలోని మణిపూర్ నుంచి మొదలైన యాత్ర.. పశ్చిమాన మహారాష్ట్రలోని ముంబైలో ముగుస్తుంది.

ఈ సారి  భారత్ న్యాయ యాత్రలో  రాహుల్ గాంధీ  14 రాష్ట్రాల్లోని 85 జిల్లాలు కవర్ చేయనున్నారు. మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల్లో  జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను  కవర్ చేస్తూ  6,200 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. జనవరి 14న మణిపూర్ నుంచి ప్రారంభమయ్యే రాహుల్ పాదయాత్రను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే జెండా ఊపి ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఎన్నికలు సమయం దగ్గర కావడంతో..ఎక్కువ మంది ప్రజలకు కాంగ్రెస్‌ను చేరిక చేయాలనే లక్ష్యంతో భారత్ న్యాయ్ యాత్రలో కేవలం పాదయాత్ర మాత్రమే కాకుండా.. కొన్ని చోట్ల బస్సులో కూడా రాహుల్ గాంధీ ప్రయాణం చేయనున్నారు.  దక్షిణాదిలోని కన్యాకుమారిలో ప్రారంభమై ఉత్తరాన కాశ్మీర్‌లో ముగిసిన భారత్ జోడో యాత్ర ఒక చారిత్రక యాత్ర అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ గుర్తు చేశారు. అలాగే ఇప్పుడు రాహుల్ మరోసారి  గొప్ప యాత్రకు శ్రీకారం చుడుతున్నారని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + nine =