ఆ దేశాల్లో 2050 నాటికి హిందువులు ఎక్కువగా ఉంటారా ?

Will There Be More Hindus in Those Countries by 2050,Will There Be More Hindus,Those Countries by 2050,More Hindus in Those Countries,Mango News,Mango News Telugu,Hindu Population Worldwide,Hinduism by Country,Hinduism on the Rise,More Hindus, Countries,in America, Indonesia, Sri Lanka, Malaysia, Britain, Canada,Hinduism Latest News,Hinduism Latest Updates,Hinduism Live News
Hinduism on the rise,more Hindus, countries,In America, Indonesia, Sri Lanka, Malaysia, Britain, Canada

ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ దాదాపు మతపరమైన జనాభాలో .. వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అలా మతపరమైన మార్పులపై అమెరికన్ థింక్ ట్యాంక్ ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన ఒక పరిశోధనలో.. ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన పరిశోధనలో.. రాబోయే నాలుగు దశాబ్దాల్లో కనుక చూస్తే.. ప్రపంచంలోని మతపరమైన జనాభాలో వేగవంతమైన,ఎన్నో మార్పులు రావచ్చని తెలిపింది. హిందూ మతంతో పాటు క్రైస్తవం, ఇస్లాంతో పాటు అనేక ఇతర మతాలు కూడా ఈ పరిశోధన పరిధిలో చేరాయి. వచ్చే 40 ఏళ్లలో ఏ దేశంలో ఏ మతం ఎక్కువగా ఉండే జనాభా ఉంటుందో ప్యూ రీసెర్చ్ సెంటర్ పరిశోధన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం.. 2050 నాటికి హిందూ మతాన్ని అనుసరించే వారి సంఖ్య.. ప్రపంచ జనాభాలో 15 శాతానికి చేరుకుంటుందని తేలింది. అంతేకాదు.. అదే సమయంలో భారతదేశంలో హిందూ మతాన్ని అనుసరించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుందని పరిశోధన వెల్లడించింది.

ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం.. భారతదేశంలో 2050 నాటికి హిందువుల జనాభా 1.297 బిలియన్లకు చేరుకుంటుంది. ఒక బిలియన్‌ అంటే 100 కోట్లు.. అలాంటిది 1.297 బిలియన్లకు భారతదేశ జనాభా చేరుకుంటుంది. ప్రస్తుతం దేశంలో హిందూ మతాన్ని అనుసరించేవారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇది మొత్తం జనాభాలో 79 పర్సంట్‌కు పైగా ఉంది. హిందువుల జనాభా పరంగా చూస్తే ఇండియా తర్వాత నేపాల్ రెండో స్థానంలో ఉంది. నేపాల్‌లో హిందువుల జనాభా 3.812 కోట్లుగా ఉంది. 2006కి ముందు నేపాల్‌ హిందూ దేశంగానే ఉండేది. కానీ ఆ తర్వాత నేపాల్ సెక్యులర్ దేశంగా స్వయంగా ప్రకటించుకుంది.

అయితే తాజాగా ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనంలో.. తెలిపిన వివరాల ప్రకారం 2050 నాటికి అమెరికాలో 47.8 లక్షల మంది హిందువులు ఉంటారట. అమెరికాలో హిందువుల జనాభా 2015 లో 22.3 లక్షలుగా ఉంది. అలాగే ఇండోనేషియాలో 2050 కల్లా హిందువుల జనాభా 41.5 లక్షలకు పెరగొచ్చని అధ్యయనంలో తేలింది. అంతేకాదు అప్పటికి శ్రీలంక, మలేషియా, బ్రిటన్, కెనడాలలో కూడా హిందువుల జనాభా మరింతగా పెరగొచ్చని అధ్యయనం తేల్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =