ప్రయాగ్‌రాజ్‌లో ప్రధాని మోదీ పర్యటన, స్వయం సహాయక బృందాల ఖాతాలోకి రూ.1000 కోట్లు

Mango News, Mango News Telugu, modi money scheme 2021, modi new scheme, modi new scheme for farmers 2021, PM Modi in Prayagraj, PM Modi in Prayagraj live updates, PM Modi In Prayagraj Today, PM Modi transfers Rs 1000 cr to bank accounts of self help groups, PM Modi Visits Prayagraj, PM Modi Visits Prayagraj Today, PM Modi Visits Prayagraj Transfers Rs 1000 Cr to Self Help Groups, PM Narendra Modi transfers Rs 1000cr to self help groups, PM visit Prayagraj today

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ మంగళవారం ఉత్తర్ ప్రదేశ్ లోని ప్ర‌యాగ్‌రాజ్‌ లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మ‌హిళ‌ల సాధికారత కోసం జ‌రుగుతున్న కార్య‌క్ర‌మంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ముందుగా ప్రధాని మోదీకి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దీనదయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జి) బ్యాంకు ఖాతాకు రూ.1000 కోట్లను ప్ర‌ధాని మోదీ బదిలీ చేశారు. దీంతో ఎస్‌హెచ్‌జిలలోని దాదాపు 16 లక్షల మంది మహిళా సభ్యులకు ప్రయోజనం చేకూరనుంది. అలాగే ముఖ్యమంత్రి క‌న్యా సుమంగ‌ళ ప‌థ‌కం కింద 1 ల‌క్ష‌కు పైగా ల‌బ్దిదారుల‌కు మొత్తం 20 కోట్ల‌కుపైగా నగదును బ‌దిలీ చేశారు. అనంతరం ఉత్తర్ ప్రదేశ్ లో 202 సప్లిమెంటరీ న్యూట్రిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లో మ‌హిళా సాధికార‌త కోసం చేస్తున్న కృషిని దేశం మొత్తం చూస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన వంటి పథకం ద్వారా నేడు రాష్ట్రంలోని లక్ష మందికి పైగా లబ్ధిదారుల ఖాతాలకు కోట్లాది రూపాయలను బదిలీ చేశామని, ఈ పథకం గ్రామీణ పేదలకు మరియు బాలికలకు విశ్వాసం కలిగించే గొప్ప మాధ్యమంగా మారుతుందని అన్నారు. మహిళల గౌరవాన్ని పెంపొందించేలా అనేక చర్యలను చేపడుతున్నట్టు తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద కోట్లాది మరుగుదొడ్ల నిర్మాణం, ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ సౌకర్యం, ఇంట్లోనే కుళాయి నీరు అందుబాటులోకి వచ్చేలా చేశామన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇస్తున్న ఇళ్లను ప్రాధాన్యతా ప్రాతిపదికన మహిళల పేరుతో నిర్మిస్తున్నట్టు ప్రధాని మోదీ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =