నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. రేపు బీఆర్ఎస్ శాశ్వత కార్యాలయం ప్రారంభం

CM KCR To Inaugurate BRS Party New Permanent Office in Delhi Tomorrow,CM KCR To Inaugurate BRS Party,BRS Party New Permanent Office,BRS New Permanent Office in Delhi Tomorrow,BRS Office in Delhi,Mango News,Mango News Telugu,CM KCR plans Delhi trip,CM KCR to inaugurate BRS Delhi office,BRS Party New Permanent Office Latest News,BRS New Permanent Office Latest Updates,BRS Party Office in Delhi News Today,CM KCR Latest News and Updates,CM KCR BRS Party Latest News and Updates

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా పేరు మార్చుకున్న తర్వాత జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే నిమిత్తం పార్టీ కార్యకలాపాలకు జాతీయ స్థాయి కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో ఢిల్లీలోని వసంత విహార్‌లో శాశ్వత కార్యాలయాన్ని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ భవనం నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం బీఆర్‌ఎస్ పార్టీ నూతన శాశ్వత కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఆయన బుధవారం ఢిల్లీకి పయనమవుతున్నారు. కాగా ఈ భవనానికి సీఎం కేసీఆర్ 2021 సెప్టెంబర్‌లో శంకుస్థాపన చేశారు. ఇక బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం చేయనున్నారు.

కాగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమలో మంత్రులు, ఎమ్మెల్యేలు సహా దాదాపు 200 మంది ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మంత్రి ప్రశాంత్‌ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ కు రానున్నారు. బీఆర్‌ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించేందుకు వీలుగా దీనిని నిర్మించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇకపై పార్టీకి సంబంధించిన అన్ని కార్యకలాపాలు, కీలక సమావేశాలు ఇక్కడే నిర్వహించబడతాయని, అలాగే వివిధ పార్టీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే వేదికగా ఇది ఉపయోగపడుతుందని వారు వెల్లడించారు. కాగా అంతకుముందు సర్దార్ పటేల్ రోడ్డులో తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించేందుకు డిసెంబర్‌లో సీఎం కేసీఆర్ చివరిసారిగా దేశ రాజధానికి వెళ్లిన విషయం గుర్తుండే ఉంటుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =