ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో ఫేక్ రివ్యూలకు చెక్, ఫ్రేమ్‌వర్క్‌ ఏర్పాటు చేయనున్న కేంద్రం

Centre Decides to Develop Framework to Check Fake Reviews on E-Commerce Websites, Centre Govt Decides to Develop Framework to Check Fake Reviews on E-Commerce Websites, Fake Reviews on E-Commerce Websites, Centre Govt Decides to Develop Framework to Check Fake Reviews, government will develop a framework to keep a check on fake reviews posted on e-commerce websites, central government announced that it will develop a framework to curb fake reviews, central government will develop a framework to keep a check on fake reviews on e-Commerce websites, Department of Consumer Affairs will develop The framework, Centre Govt, Fake Reviews on E-Commerce Websites, check on fake reviews, E-Commerce Websites Fake Reviews, protect consumers interests, E-Commerce Websites News, E-Commerce Websites Latest News, E-Commerce Websites Latest Updates, E-Commerce Websites Live Updates, Mango News, Mango News Telugu,

ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో ఫేక్/నకిలీ రివ్యూలకు చెక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయనుంది. ఈ-కామర్స్ సైట్స్ లో ఫేక్ మరియు తప్పుదారి పట్టించే రివ్యూలతో వినియోగదారుల ఆసక్తిపై ప్రభావం పడుతుందని, ఈ నేపథ్యంలో ఫేక్ రివ్యూలను కట్టడి చేయడంపై ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ భారతదేశంలోని ఈ-కామర్స్ సంస్థలు అనుసరిస్తున్న ప్రస్తుత మెకానిజం మరియు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసిన తర్వాత ఈ ఫ్రేమ్‌వర్క్‌లను అభివృద్ధి చేయనుంది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌సీఐ)తో కలిసి ఈ-కామర్స్ సంస్థలు, వినియోగదారుల ఫోరమ్‌లు, న్యాయ విశ్వవిద్యాలయాలు, న్యాయవాదులు, ఫిక్కీ, సీఐఐ, వినియోగదారుల హక్కుల కార్యకర్తలు మరియు ఇతర వివిధ వాటాదారులతో కలిసి ఒక సమావేశంలో వెబ్‌సైట్లలో ఫేక్ రివ్యూలపై రాబోయే పరిమాణం మరియు రోడ్‌మ్యాప్ గురించి చర్చించింది.

ప్రోడక్ట్ ను భౌతికంగా వీక్షించడానికి లేదా పరిశీలించడానికి ఎటువంటి అవకాశం లేకుండా వర్చువల్ షాపింగ్ అనుభవాన్ని ఈ-కామర్స్ సంస్థలు అందిస్తున్నాయి కాబట్టి, ఇప్పటికే కొన్న వస్తువు లేదా సర్వీస్ పై కొనుగోలు చేసిన వినియోగదారుల అభిప్రాయం మరియు వారి అనుభవాన్ని చూడటానికి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేసిన రివ్యూపైనే వినియోగదారులు ఎక్కువగా ఆధారపడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో రివ్యూ ఇచ్చిన వ్యక్తి యొక్క ప్రామాణికతను నిర్ధారించడం ద్వారా గుర్తించడం మరియు ప్లాట్‌ఫారమ్ యొక్క అనుబంధ బాధ్యత అనేది రెండు ప్రధాన అంశాలుగా మారాయని అన్నారు.

అలాగే ఈ-కామర్స్ సంస్థలు నిష్పక్షపాతంగా మరియు పారదర్శకంగా ప్రదర్శించడం కోసం అత్యంత సంబంధిత సమీక్షలను (మోస్ట్ రేలవంట్ రివ్యూ) ఎలా ఎంచుకుంటారో వెల్లడించాలని డిఓసీఏ సెక్రటరీ రోహిత్ కుమార్ సింగ్ అన్నారు. ఈ సమస్యను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడం కోసం సమస్యను పరిష్కరించడానికి ఫేక్ రివ్యూలను నియంత్రించే తగిన ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయవచ్చని వాటాదారులందరూ ఈ సమావేశంలో అంగీకరించారని తెలిపారు. కాగా ఈ-కామర్స్ కంపెనీల వాటాదారులు తాము ఫేక్ రివ్యూలను పర్యవేక్షించే ఫ్రేమ్‌వర్క్‌లను కలిగి ఉన్నామని, అయితే ఈ సమస్యపై చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంలో పాల్గొనడానికి సంతోషిస్తున్నామని పేర్కొన్నట్టు కేంద్రం తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 3 =