నేడు పిల్లలు ఎంచుకున్న మార్గమే రానున్న రోజుల్లో భారతదేశ ప్రయాణాన్ని నిర్దేశిస్తుంది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Childrens Day Students from Various Schools Met President Droupadi Murmu at Rashtrapati Bhavan Cultural Centre,First PM Pandit Jawaharlal Nehru,Nehru Birth Anniversary,Mango News,Mango News Telugu,Pandit Jawaharlal Nehru,Narendra Modi Latest News And Updates,PM Narendra Modi News And Live Updates,Jawaharlal Nehru,Nehru Anniversary,November 14th, Childrens Day, Indian Childrens Day,Nehru Birth Anniversary,President Droupadi Murmu,Rashtrapati Bhavan Cultural Centre

బాలల దినోత్సవం సందర్భంగా(నవంబర్ 14, 2022) సోమవారం ఉదయం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, బాల్యం జీవితంలో అత్యంత అందమైన దశ అని అన్నారు. ఈ రోజు మనం పిల్లలలోని ఇన్నోసెన్స్/అమాయకత్వం మరియు స్వచ్ఛతను జరుపుకుంటున్నామని అన్నారు. ప్రతి కొత్త తరం కొత్త అవకాశాలను, కొత్త కలలను తీసుకువస్తుందని రాష్ట్రపతి అన్నారు.

“ఇది సాంకేతిక మరియు సమాచార విప్లవం యొక్క కొత్త యుగం. పిల్లలు ఇప్పుడు వివిధ గృహ, సామాజిక మరియు పర్యావరణ సమస్యల గురించి తెలుసుకుంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో విజ్ఞానం, సమాచారం ఇప్పుడు వారి చేతికి అందుతున్నాయి. కాబట్టి వారికి సరైన విలువలను బోధించడానికి మరియు వివిధ కార్యకలాపాలు మరియు చర్చలలో వారిని భాగస్వామ్యం చేయడానికి మనం మరింత కృషి చేయడం చాలా ముఖ్యం. పిల్లల నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు” అని రాష్ట్రపతి అన్నారు.

నేడు పిల్లలు ఎంచుకున్న మార్గమే రానున్న రోజుల్లో భారతదేశ ప్రయాణాన్ని నిర్దేశిస్తుంది:

పిల్లలు పెద్ద కలలు కనాలని, కొత్త అభివృద్ధి చెందిన భారతదేశం కోసం కలలు కనాలని రాష్ట్రపతి సూచించారు. నేటి కలలు రేపు సాకారమవుతాయని ఆమె అన్నారు. పెద్దయ్యాక ఎలాంటి భారతదేశంలో జీవించాలనుకుంటున్నారో ఆలోచించాలని ఆమె వారికి సూచించారు. అంతిమంగా గొప్ప విజయానికి దారితీసే ఫలితం గురించి చింతించకుండా విధి మార్గంలో నడవాలని ఆమె వారిని కోరారు. నేడు వారు ఎంచుకున్న మార్గమే రానున్న రోజుల్లో భారతదేశ ప్రయాణాన్ని నిర్దేశిస్తుందని అన్నారు. పెద్దయ్యాక కూడా తమలోని బిడ్డను బతికించుకోవాలని ఆమె వారికి సలహా ఇచ్చారు. భారతదేశ సంస్కృతితో ముడిపడి ఉండాలని, వారి తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవించాలని మరియు మాతృభూమిని ప్రేమించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విద్యార్థులకు సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − seven =