కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్డౌన్ నియమ నిబంధనలకు అనుగుణంగా దేశీయ, అంతర్జాతీయ విమానయాన, ప్యాసింజర్ రైళ్ల సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత మంత్రిత్వ శాఖలు ప్రకటనలు విడుదల చేశాయి. అన్ని దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను మే 3వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు నిలిపివేస్తున్నట్టు కేంద్ర పౌరవిమానయానశాఖ ప్రకటించింది.
అలాగే మే 3వ తేదీ అర్ధరాత్రి వరకు ప్రీమియమ్, మెయిల్, ఎక్స్ప్రెస్, ప్యాసింజర్, సబర్బన్, కోల్కతా మెట్రో, కొంకణ్ రైల్వే తదితర రైళ్లు సర్వీసులను నిలిపివేస్తున్నట్టు రైల్వే శాఖ స్పష్టం చేసింది. దేశంలో నిత్యావసర వస్తువుల సరఫరా నిమిత్తం కొన్ని గూడ్స్, పార్శిల్ రైళ్లు మాత్రం యథావిథంగా కొనసాగనున్నాయి. అన్ని టికెట్ కౌంటర్లు మూసివేయబడతాయని, అడ్వాన్స్ ఆన్లైన్ టికెట్ బుకింగ్ కూడా పూర్తిగా ఆగిపోయిందని చెప్పారు. ఆన్లైన్ రద్దు సౌకర్యం పనిచేస్తుందని, రద్దు చేసిన అన్ని టిక్కెట్లకు పూర్తి డబ్బు వాపసు ఇస్తామని పేర్కొన్నారు.
All domestic and international scheduled airlines operations shall remain suspended till11:59pm of 03 May 2020.
— DGCA (@DGCAIndia) April 14, 2020
All passenger train services on Indian Railways including Premium trains, Mail/Express trains, Passenger trains, Suburban Trains, Kolkata Metro Rail, Konkan Railway etc shall continue to remain cancel till the 2400hrs of 3rd May 2020. #IndiaFightsCorona
— Ministry of Railways (@RailMinIndia) April 14, 2020
Passenger train services cancelled till 3rd May 2020
All ticket counters will remain closed
Advance online ticket booking stopped completely
Online cancellation facility will remain functional
Full refund for all cancelled tickets#IndiaFightsCorona https://t.co/MQ8ogodzrH pic.twitter.com/5K0dt4L3e7
— Ministry of Railways (@RailMinIndia) April 14, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]