చలికాంలోనే ఈ సమస్య ఎక్కువగా ఎందుకుంటుంది?

December Is Problem For The Heart, Heart Problems December, Heart Problems, December Heart Problems, Heart Attacks,Heart Attacks In December Month,ACS, Heart Attacks News, Latest Healh News, Health Tips, Latest Heart Attacks News, Tips For Health, Heart, Mango News, Mango News Telugu
Heart Attacks,Heart Attacks in December month,ACS,

చలికాలంలో చలితో పాటు  ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సాధారణ సమస్యలు విజృంభిస్తాయి. దీంతో చాలా మంది  వీటిని తగ్గించుకోవడానికి రోగనిరోధక శక్తిని పెంచుకునే దిశగా ఆహారం తీసుకోవడం, వివిధ రకాలు  పానీయాలు తీసుకోవడం వంటివి చేస్తుంటారు.

కానీ తాజాగా శాస్త్రవేత్తలు చేసిన ఓ పరిశోధనలో చలికాలంలో..అది కూడా డిసెంబర్‌లో గుండెకు పెద్ద గండమే ఉందని తేలింది. గుండెపోటు వల్ల సంభవిస్తున్న మరణాలను కొన్నాళ్లుగా అధ్యయనం చేసిన పరిశోధకులు..  చలికాలంలోనే ఎక్కువగా నమోదవుతున్నట్లు గుర్తించారు.

చలికాలంలో గుండెపోటు సమస్యలు ఎక్కువగా నమోదు అవడం..అందులోనూ డిసెంబర్‌లోనే ఈ సమస్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే విషయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే  అక్యూట్ కరోనరీ సిండ్రోమ్ .. గుండెపోటు మరణాలకు ప్రధాన కారణంగా ఉందని అంటున్నారు. ఇది చాలా తొందరగా మయోకార్డియల్ ఇస్కీమియాకు దారి తీస్తుందని చెబుతున్నారు.

చాలామంది మగవాళ్లు చలికాలంలో వెచ్చదనం కోసం పదే పదే స్మోకింగ్ చేస్తుంటారు. దీంతో పాటు వారిలో ఉన్న రక్తపోటు, హైపర్లిపిడెమియా సమస్యలు కూడా అక్యూట్ కరోనరీ డిసీజ్‌కు ప్రధాన కారణం అవుతుంది. ఇలా గుండెపోటుతో చలికాలంలో సంభవిస్తున్న మరణాలు  71.8శాతం ఉండటం నిజంగా ఆందోళన కలిగించే విషయమే.

వృద్దులలో చలికాలంలో గుండెపోటు సమస్యలు సాధారణం. కానీ ఈ మధ్యకాలంలో అది కూడా కరోనా తర్వాత వస్తున్న గుండెపోటు సమస్యలు వయసుతో సంబంధం లేకుండా కనిపిస్తున్నాయి.  చిన్న వయసు వారు గుండెపోటుతోనే చనిపోతున్న సంఘటనలు జరుగుతున్నాయి. కరోనా తర్వాత రోగ నిరోధక శక్తిపై ఆ వైరస్ భయంకరంగా ప్రభావం చూపించడం వల్ల చలికాలంలో ఆ గుండెపోటు సమస్యను పెంచుతోంది.  ఈ డిసెంబర్ నెలలో చలి మరీ ఎక్కువగా ఉండటం వల్ల ఈ సమస్య  మరింత పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. దీంతోనే అన్ని వయసుల వారికి  చివరకు జెండర్ తో కూడా  సంబంధం లేకుండా గుండెపోటు సమస్య వస్తోన్నట్లు తేల్చారు.

చలికాలంలో వస్తున్న గుండెపోటు సమస్యల్ని అడ్డుకోవడానికి ముందుగా ప్రతి ఒక్కరి  జీవనశైలి మార్చుకోవాలి. శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంచడానికి వ్యాయామాలు, యోగా చేయడం వంటివి చేయాలి. శరీరాన్ని చురుగ్గా ఉండే ఆహారాలు తీసుకోవాలి. వీలైనంత సమయం ఎండలో గడపడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మంచి ఆరోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారిలో గుండెపోటు ప్రమాదాలు చాలా తక్కువగా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 15 =