కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రం కీలక నిర్ణయం, 18-44 వయస్సువారికి ఆన్‌సైట్‌ రిజిస్ట్రేషన్

above 18 years covid vaccine registration, Centre Allows Onsite Registration for 18-44 Age Group, Coronavirus Live, Covid Vaccine, covid vaccine registration website, Covid-19 Vaccination, COVID-19 Vaccine Update, cowin registration, Mango News, On-site registration for 18 years and above, On-site registration for Covid-19 Vaccine, Registration for 18-44 Age Group, self-registration covid-19 vaccine, vaccine registration india for 18 plus

దేశంలో కరోనా వ్యాక్సిన్ కి పంపిణీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 18-44 సంవత్సరాల వయస్సు గలవారికి ఆన్-సైట్ రిజిస్ట్రేషన్/సౌకర్యవంతమైన కోహోర్ట్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వ్యాక్సినేషన్ మూడో దశలో భాగంగా దేశంలో మే 1 నుండి 18 ఏళ్లు పైబడిన వారికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ముందుగా 18-45 సంవత్సరాల వాళ్ళకి సెల్ఫ్ రిజిస్ట్రేషన్స్ మరియు ముందస్తు అపాయింట్‌మెంట్స్ ద్వారా మాత్రమే వ్యాక్సిన్ తీసుకునే అవకాశం కల్పించారు, ఎలాంటి వాక్‌-ఇన్‌ రిజిస్ట్రేషన్లకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు.

అయితే ఆన్‌లైన్ స్లాట్‌లతో ప్రత్యేకంగా నిర్వహించిన వ్యాక్సిన్ సెషన్ల సందర్భంగా ఆ రోజు చివరికల్లా నమోదు చేసుకున్న లబ్ధిదారులు ఏ కారణం చేతనైనా వ్యాక్సిన్ తీసుకునేందుకు రాకపోతే కొన్ని డోసులు నిరుపయోగంగా మారుతున్నాయని, ఇటువంటి సందర్భాల్లో వ్యాక్సిన్ వృధాని తగ్గించడానికి కొంతమంది లబ్ధిదారుల ఆన్-సైట్ నమోదు అవసరం కావచ్చుని కేంద్రం పేర్కొంది. అలాగే కోవిన్ ప్లాట్‌ఫాం, ఆరోగ్యా సేతు మరియు ఉమాంగ్ వంటి యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ కు అవకాశం ఉన్నపటికీ ఇంటర్నెట్ లేదా స్మార్ట్ ఫోన్లు లేదా మొబైల్ ఫోన్‌ల సౌకర్యం లేనివారికి వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆన్‌-సైట్‌ రిజిస్ట్రేషన్‌ ఉపయోగపడనుందని, ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని 18-44 సంవత్సరాలవారికీ ఆన్‌సైట్‌ లేదా వాక్‌-ఇన్‌ సౌకర్యం కలిపిస్తునట్టు తెలిపారు.

కాగా 18-44 సంవత్సరాల వయస్సుగల వారికి ఆన్-సైట్ రిజిస్ట్రేషన్ ప్రస్తుతం ప్రభుత్వ కరోనా వ్యాక్సిన్ కేంద్రాలలో మాత్రమే ప్రారంభించబడుతుందని, ప్రైవేట్ వ్యాక్సిన్ కేంద్రాల్లో అందుబాటులో ఉండదని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఆన్-సైట్ రిజిస్ట్రేషన్ నిర్ణయం అమలుపై రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలదే తుది నిర్ణయమని కేంద్రం పేర్కొంది. వ్యాక్సిన్ వృదాను తగ్గించడానికి మరియు అర్హులైన అందరికి వ్యాక్సిన్ వేసేలా స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఇక 18-44 సంవత్సరాల వయస్సు వారికి ఆన్-సైట్ రిజిస్ట్రేషన్ ప్రారంభించే సమయంలో వ్యాక్సిన్ వేసే కేంద్రాల వద్ద రద్దీని నివారించడానికి చాలా జాగ్రత్తలు వహించాలని, ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =