ఢిల్లీలో ప్రైవేట్ కార్యాలయాల ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ విధానం మాత్రమే అమలు

DDMA Orders All Private Offices Shall Be Closed Allow Employees Into Work From Home Mode Only, DDMA orders closure of private offices, DDMA Orders All Private Offices Shall Be Closed, DDMA Says Allow Employees Into Work From Home Mode Only, DDMA Orders, DDMA Orders Latest News, DDMA Orders Live Updates, DDMA, DDMA Latest News, DDMA Latest Updates, All Private Offices Shall Be Closed, Employees Into Work From Home Mode, All Private Employees Into Work From Home Mode, Work From Home Mode, Mango News, Mango News Telugu, All Private Offices Closed, All Private Offices Closed In Delhi, Delhi's Private Offices Ordered To Close, delhi govt latest order and circular for covid-19, Private offices Closed in Delhi during lockdown,DDMA Orders All Private Offices Shall be Closed, Allow Employees into Work From Home Mode Only

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు రోజురోజుకి పెరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్-19 పాజిటివిటీ రేటు, ఒమిక్రాన్‌ వేరియంట్ కేసుల నమోదు అధికంగా ఉంది. ఢిల్లీలో సోమవారం 19,166 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (డీడీఎంఏ) అథారిటీ అప్రమత్తమై కీలక నిర్ణయం తీసుకుంది. నూతన కోవిడ్ నిబంధనల ప్రకారం ఢిల్లీలోని అన్ని ప్రైవేట్ కార్యాలయాలను మూసివేసి, ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్‌ విధానం మాత్రమే అమలు చేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు. కేవలం అత్యవసర సేవలుగా పరిగణించబడే కార్యాలయాలకు మాత్రమే ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పారు.

ఇక ఇప్పటివరకు ప్రైవేట్ కార్యాలయాలు 50 శాతం ఉద్యోగులతో కార్యాలయంలో, మిగిలిన 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్‌ విధానంలో పనిచేస్తుండగా తాజాగా ఉద్యోగులు అందరికి వర్క్ ఫ్రమ్ హోమ్‌ అమలు చేయాలని ఆదేశించారు. మరోవైపు నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం ఉద్యోగుల హాజరుతో పని చేస్తున్నాయి. అలాగే ఢిల్లీ రెస్టారెంట్లు మరియు బార్లను మూసివేయాలని, కేవలం టేక్‌అవేలు, హోమ్ డెలివరీకి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (డీడీఎంఏ) అథారిటీ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 1 =