వైద్య చరిత్రలో అద్భుత ఘట్టం – మనిషికి అమర్చిన పంది గుండె

Historic, Man gets genetically-modified pig heart, Mango News, Pig Heart in a Human, Pig heart transplanted into human body, Pig heart transplanted into human body in medical first, Surgeons Implant Pig Heart Into Human Patient, US Surgeon Implants A Pig Heart Successfully Into A 57 Year old, US surgeons successfully implant pig heart in human, US Surgeons Successfully Implanted Pig Heart in a Human

ప్రపంచ వైద్య చరిత్రలో ఎన్నడూ జరగని ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. కొన్ని సంవత్సరాల క్రితం గుండె మార్పిడి ఆపరేషన్లు మొదలైనప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరూ అచ్చెరువొందారు. జంతువుల గుండెను మనుషులకు అమర్చడం మాత్రం చాలా అరుదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఓ పంది గుండెను మనిషికి అమర్చారు అమెరికా వైద్యులు. ఈ ఉత్కంఠభరిత ఆపరేషన్ సక్సెస్ అయిందని డాక్టర్లు ప్రకటించారు.  అమెరికాలోని మేరీల్యాండ్ మెడికల్ స్కూల్ ఆస్పత్రిలో డేవిడ్ బెన్నెట్ అనే 57 సంవత్సరాల వ్యక్తికి పంది గుండెను అమర్చిన ఘటన వెలుగులోకి వచ్చింది.

అమెరికాలోని బాల్టిమోర్‌ మేరీలాండ్‌ మెడికల్‌ స్కూల్‌ ఆస్పత్రిలో ఈ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. పంది నుంచి తీసిన గుండెను మనిషికి అమర్చారు అక్కడి వైద్యులు. దీనిపై వారు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జన్యుపరంగా మార్పులు చేసిన పంది గుండెను మనిషికి అమర్చడం ద్వారా ప్రాణదానం చేసినట్లయింది. సాధారణంగా హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్లలో బ్రెయిన్ డెడ్ వ్యక్తుల గుండెలను ఇతరులకు అమర్చుతారు. అయితే, అలాంటి సంప్రదాయ మార్పిడికి డేవిడ్ బెర్నెట్ ఆరోగ్య పరిస్థితి అనుకూలించలేదు. అందుకే, డాక్టర్లు అతనికి పంది గుండెను అమర్చారు.

అయితే, దీనికోసం ముందుగా.. అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్ అత్యవసర అనుమతులు జారీ చేసింది. ప్రస్తుతం డేవిడ్‌ కోలుకుంటున్నాడని, ఇంకొన్నాళ్లు అబ్జర్వేషన్‌లో ఉంచి ఆయన్ను పర్యవేక్షిస్తామని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ ఆతడు పూర్తిగా కోలుకుంటే వైద్య చరిత్రలో ఓ అద్భుతం జరిగినట్టే అవుతుంది. పంది గుండెను మనిషికి అమర్చడం వైద్య శాస్త్రంలో ఇదొక చారిత్రక ఘట్టమని చెబుతున్నారు వైద్యులు. దీని ద్వారా భవిష్యత్తులో ఆర్గాన్‌ డొనేషన్స్‌ కొరతను పరిష్కరించడానికి ఒక మార్గం దొరికినట్లయిందన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =