రద్దయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సింగ‌పూర్ టూర్.. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్, కేంద్రంపై ఆప్ స‌ర్కార్ విమర్శలు

Delhi AAP Govt Slams Centre Over L-G Rejecting CM Arvind Kejriwal's Proposed Visit of Singapore, AAP Govt Slams Centre Over L-G Rejecting CM Arvind Kejriwal's Proposed Visit of Singapore, L-G Rejecting CM Arvind Kejriwal's Proposed Visit of Singapore, CM Arvind Kejriwal's Proposed Visit of Singapore, Delhi AAP Govt Slams Centre, Arvind Kejriwal's Proposed Visit of Singapore, Singaporean government has withdrawn its invitation to Delhi CM Arvind Kejriwal to attend the World Cities Summit 2022, World Cities Summit 2022, 2022 World Cities Summit, World Cities Summit, CM Arvind Kejriwal News, CM Arvind Kejriwal Latest News, CM Arvind Kejriwal Latest Updates, CM Arvind Kejriwal Live Updates, Mango News, Mango News Telugu,

ఢిల్లీ ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న ర‌ద్దవ‌డం ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వంపై ‘ఆప్’ పార్టీ మండిపడింది. కావాలనే సీఎం కేజ్రీవాల్ విదేశీ ప‌ర్య‌ట‌న‌కు కేంద్రం క్లియ‌రెన్స్ ఇవ్వ‌లేద‌ని మోదీ స‌ర్కార్‌పై విమర్శలు చేసింది. కాగా వచ్చే నెలలో సింగ‌పూర్‌లో జ‌రుగనున్న ప్ర‌పంచ న‌గ‌రాల స‌ద‌స్సుకు కేజ్రీవాల్‌కు ఆహ్వానం అందగా, ఈ పర్యటనకు అవ‌స‌ర‌మైన లాంఛ‌నాల‌ను ఢిల్లీ ప్ర‌భుత్వం జులై 20 నాటికే పూర్తిచేసింది. అయితే కొన్ని సాంకేతిక కారణాలను చూపుతూ జులై 21న ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ఆ ఫైల్‌ను తిప్పిపంపారు. అయితే ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటనకు కేంద్రం అనుమతి కోరుతూ జూన్ 7న లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫైల్‌ను పంపామని, కానీ దీనిపై ఒక‌టిన్న‌ర నెల పాటు ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌కుండా చివరి నిమిషంలో జులై 21న ఫైల్‌ను తిప్పిపంపార‌ని వివరించింది.

ఈ క్రమంలో లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మరియు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి సీఎం పర్యటనకు సంబంధించి అవ‌స‌ర‌మైన అనుమ‌తులు ల‌భించ‌డంలో తీవ్ర జాప్యం నెల‌కొన‌డంతోనే ఇత‌ర లాంఛ‌నాల‌ను పూర్తి చేసేందుకు స‌మ‌యం లేకుండా పోయింద‌ని ఢిల్లీ ప్ర‌భుత్వం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి జూలై 20 చివరి తేదీ అని, కానీ వారు కావాలనే ఆలస్యంగా 21న ఫైల్‌ను పంపారని, దీనికి కేంద్రమే బాధ్యత వహించాలని ఆప్ పేర్కొంది. ఆరోగ్యం, విద్య మరియు ఇతర రంగాలలో ఢిల్లీలో జరిగిన అనేక అభివృద్ధి పనుల గురించి అంతర్జాతీయ ఫోరమ్‌లో ముఖ్యమంత్రిని మాట్లాడకుండా చేయడమే కేంద్రం ఉద్దేశమని ఆప్ సర్కార్ ఆరోపించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 11 =