2001 పార్లమెంటుదాడిలో అమరులైనవారికి ప్రధాని మోదీ నివాళులు, వారి ధైర్యసాహసాలు, త్యాగాలను ఎప్పటికీ మరువలేం

PM Narendra Modi Pays Homage to those who were Martyred During the 2001 Parliament Attack,PM Narendra Modi Homage To Martyred,PM Narendra Modi,2001 Parliament Attack,Mango News,Mango News Telugu,Parliament Attack On 2001,Parliament Attack India,Prime Minister Narendra Modi, Narendra Modi News and Updates,PM Modi Latest News and Updates,PM Modi,Prime Minister Modi,Indian Prime Minister Modi Latest News and Updates,

2001 పార్లమెంటు దాడిలో అమరులైన వారికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు నేతలు నివాళులర్పించారు. 2001లో ఈ రోజున జరిగిన తీవ్రవాద దాడికి వ్యతిరేకంగా పార్లమెంటును రక్షించే సమయంలో తమ ప్రాణాలను అర్పించిన వీర అమరవీరులకు దేశం నివాళులర్పిస్తుంది. వారి ధైర్యానికి మరియు అత్యున్నత త్యాగానికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.

అలాగే 2001లో జరిగిన ఉగ్రదాడిలో పార్లమెంట్‌ను రక్షించడంలో ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు పార్లమెంట్ వద్ద ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేబినెట్ మంత్రులు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, పలువురు పార్లమెంట్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “2001 పార్లమెంటు దాడిలో అమరులైన వారికి నివాళులు అర్పించాను. వారి సేవ, ధైర్యసాహసాలు మరియు త్యాగాలను మనం ఎప్పటికీ మరువలేము” అని పేర్కొన్నారు.

2001, డిసెంబర్ 13న ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడి చేసారు. ఈ దాడిని భద్రతా దళాలు సమర్ధవంతంగా ఎదుర్కొని, మొత్తం ఐదుగురు ఉగ్రవాదుల్నీ హతమార్చారు. ఈ దాడి సందర్భంగా ఐదుగురు ఢిల్లీ పోలీసు సిబ్బంది, ఒక సీఆర్‌పీఎఫ్ మహిళ కానిస్టేబుల్, ఇద్దరు పార్లమెంటు భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి సహా మొత్తం తొమ్మిది మంది అమరులయ్యారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =