ఫిఫా వరల్డ్ కప్‌: మొదలైన టైటిల్‌ ఫేవరెట్‌ బ్రెజిల్‌ దండయాత్ర, తొలి మ్యాచ్‌లో సెర్బియాపై 2-0తో విజయం

FIFA World Cup 2022 Title Favourite Brazil Beats Serbia with 2-0 in Their First match,Fifa World Cup,Title Favorites Brazil, Brazil's Invasion Begins, 2-0 Win Over Serbia In Opener,Mango News,Mango News Telugu,FIFA World Cup 2022, Cristiano Ronaldo ,Fifa World Cup,Brazil Won Match,Brazil FIFA World Cup,Fifa World Cup News,Fifa World Cup Latest News And Updates,Fifa World Cup News And Live Updates

ఫిఫా ప్రపంచ కప్‌ ప్రారంభమైన వారం తర్వాత టైటిల్‌ ఫేవరెట్‌, వరల్డ్‌ నెం.1 జట్టు బ్రెజిల్‌ (సాంబా) తన తొలి మ్యాచ్‌ను ఆడింది. సాకర్ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ మ్యాచ్‌లో పేరుకి తగ్గట్లే ఘన విజయం సాధించింది. లుసైల్‌ స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన గ్రూప్‌ ‘జి’ మ్యాచ్‌లో ‘నెయ్‌మార్’ సారథ్యంలోని సాంబా జట్టు 2-0తో సెర్బియాపై గెలుపొందింది. తొలి అర్ధభాగాన్ని ఇరు జట్లూ ఒక్క గోల్ కూడా లేకుండా ముగించాయి. అయితే మలిభాగంలో సాంబా జట్టు తన మార్క్ ఆటను ప్రదర్శించింది. పదేపదే ప్రత్యర్థి గోల్ పోస్టులపై దాడులు చేసింది. ఈ క్రమంలో ఆట 62వ నిమిషంలో టాటెన్‌హామ్‌ స్టార్‌ ఫార్వర్డ్‌ రిచర్‌లీసన్‌ బ్రెజిల్‌కు మొదటి గోల్‌ అందించాడు. అనంతరం రిచర్‌లీసన్‌ కళ్లు చెదిరే విధంగా రెండో గోల్‌ చేశాడు.

వినిసియస్‌ నుంచి వచ్చిన క్రాస్‌ పాస్‌ను ఎడమ కాలితో తన నియంత్రణలోకి తెచ్చుకున్న రిచర్‌లీసన్‌ ఒక్కసారి పైకి ఎగిరి ‘బైసైకిల్‌ కిక్‌’తో కుడి కాలితో గోల్‌ పోస్ట్‌లోకి కొట్టడంతో సెర్బియాతో పాటు అభిమానులు ఆశ్చర్య చకితులయ్యారు. దీంతో బ్రెజిల్‌ జట్టు 2-0 ఆధిక్యంలోకి వెళ్ళింది. అయితే చివరివరకూ సెర్బియా జట్టు ఒక్క గోల్ కూడా చేయలేకపోవడంతో సాంబా జట్టు తిరుగులేని విజయం సాధించింది. అయితే విజయం సాధించి ఊపుమీదున్న సాంబా జట్టుకి ఈ మ్యాచ్‌లో ఒక షాక్ తగిలింది. ఆ జ‌ట్టు స్టార్ ఆట‌గాడు నెయ్‌మార్ మోకాలికి గాయం అయింది. ఆట మరో 10 నిమిషాల్లో ముగుస్తందన‌గా అత‌ను మైదానం వీడాడు. ఈ క్రమంలో గాయం నుంచి కోలుకునేందుకు నెయ్‌మార్‌కు కొద్దిరోజులు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని, అందువ‌ల్ల అత‌ను గ్రూప్ మ్యాచ్‌ల‌కు అందుబాటులో ఉండ‌డ‌ని జ‌ట్టు వైద్యులు ప్రకటన చేశారు. ఇక డిసెంబ‌ర్ 3వ తేదీ నుంచి జ‌రిగే నాకౌట్ స్టేజ్ మ్యాచ్‌ల‌కు నెయ్‌మార్‌ అందుబాటులో ఉండొచ్చని తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 10 =