తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ రాకెట్ డిజైన్, తయారీ, పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తాం: మంత్రి కేటీఆర్

Minister KTR Participates in Skyroot Aerospace's Vikram-S rocket Launch Success Meet in T-Hub,Telangana Integrated Rocket Design,Telangana Manufacturing And Testing Center,Telangana Minister Ktr,Mango News,Mango News Telugu,Telangana Rocket Facility,Integrated Rocket Design,Telangana Rocket Manufacturing,Telangana Rocket Testing Centre,India's 1st Integrated Rocket Manufacturing,Telangana RocketTesting Facility,TS To Host Skyroot Facility To Design,Telangana IT Minister KTR,Minister KTR Latest News And Updates

స్కైరూట్ ఏరోస్పేస్ విక్రమ్-ఎస్ రాకెట్‌ను ఇటీవలే విజయవంతంగా ప్రయోగించిన సందర్భంగా శుక్రవారం టీ-హబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, స్కై రూట్‌తో కలిసి భారతదేశపు మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ రాకెట్ డిజైన్, తయారీ మరియు టెస్టింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో రాకెట్ల రూపకల్పన, తయారీ, పరీక్షించే సౌకర్యాన్ని నెలకొల్పేందుకు స్టార్టప్ కో-ఫౌండర్లు పవన్ చందన, భారత్ దకాలకు పూర్తి సహకారం అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

హైదరాబాద్ ఆధారిత స్టార్టప్ అయిన స్కైరూట్ ఏరోస్పేస్, టీ-హబ్‌లో మొదలై, టీవర్క్స్ మద్దతుతో భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్‌ను నవంబర్ 18, 2022న ప్రారంభించింది. ఈ బాటలో కష్టాలను ఎదుర్కొన్న స్కైరూట్ ఏరోస్పేస్ టీమ్ మంత్రి కేటీఆర్ అభినందించారు. భారతదేశంలోని హైదరాబాద్‌కు చెందిన ఒక స్పేస్‌టెక్ కంపెనీ అన్ని అడ్డంకులను ఛేదించిందని మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కంపెనీలు మాత్రమే రాకెట్ సైన్స్‌కు ప్రాధాన్యమిచ్చాయని, తొలిదశలోనే విజయం సాధించాయని కేటీఆర్ అన్నారు. ఈ ప్రయోగం నిజంగా చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను భారతదేశానికి స్పేస్‌టెక్ రాజధానిగా చూడటం చాలా ఆనందంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పేస్ టెక్ పాలసీని ప్రారంభించిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. అలాగే ఈరోజు (నవంబర్ 26,2022) రెండు ఉపగ్రహాలను ప్రయోగించనున్న హైదరాబాద్‌లోని స్పేస్‌టెక్ స్టార్టప్ ధృవ స్పేస్‌కు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + five =