తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై ఈ నెల 23న కేంద్ర హోంశాఖ కీలక సమావేశం

Union Home Ministry To Hold Key Meet on 23rd Over AP Bifurcation Pending Issues,AP Bifurcation Pending Issues,Union Home Ministry,Union Home Ministry Meet on AP Bifurcation,Mango News,Mango News Telugu,AP Resolve Pending Bifurcation Issues,Pending Bifurcation Issues,MHA Holds Meeting On Andhra,MHA To Hold Crucial Meeting,High-Level Meet Over AP Bifurcation Issues,AP Bifurcation Issues,Bifurcation Issues TS & AP

ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23న కేంద్ర హోంశాఖ కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం జనాభా ప్రాతిపదికన ఆస్తులు మరియు అప్పులను విభజించిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన జరిగి దాదాపు ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయి. కాగా విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, అంశాలు పదేళ్ల వ్యవధిలోపు పూర్తి చేయాలని నిబంధన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ దీనిపై దృష్టి సారించింది. దీంతో ఈ నెల 23న జరుపనున్న సమావేశానికి రావాల్సిందిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు సమాచారం అందించింది. ఈ సమావేశంలో విభజన సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చించాలని హోంశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇంతకుముందు సెప్టెంబర్‌ 27న జరిగిన భేటీలో ఏడు ఉమ్మడి అంశాలపై చర్చించింది. అయితే ఈ సమావేశంలో ఆయా సమస్యలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. దీంతో త్వరలో జరుగనున్న భేటీలో ఏడు ఉమ్మడి అంశాలు సహా ఏపీకి సంబంధించిన మరో ఏడు అంశాలపై చర్చించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 17 =