రాష్ట్రంలో నూతన స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయాలి: సీఎస్ సోమేశ్ కుమార్

CS Somesh Kumar Orders Officials to Form New Self Help Groups in the State,New Self Help Groups, Self Help Groups Should Be Formed,Self Help Groups Telangana,CS Somesh Kumar,CS review with District Collectors,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana CS Somesh Kumar

రాష్ట్రంలో కొత్త సభ్యులతో నూతన స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో స్వయం సహాయక బృందాల పనితీరుపై బీఆర్ కేఆర్ భవన్లో శుక్రవారం సీఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఐటీ,పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి రఘునందన్ రావ్, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 6,06,000 స్వయం సహాయక బృందాలలో 64 లక్షల మంది సభ్యులున్నారని తెలిపారు. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 4 ,30 ,785 బృందాలలో 46 లక్షలకు పైగా సభ్యులుండగా, పట్టణ ప్రాంతాల్లో ఉన్న 1,76,623 బృందాలలో దాదాపు 18 లక్షల మంది సభ్యులున్నారని వెల్లడించారు.

గ్రామాలు, పట్టణాలలో గ్రూపుల్లో చేరని సభ్యులను గుర్తించి కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సీఎస్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్.హెచ్.జి గ్రూపులు, సభ్యుల వివరాలను పూర్తి స్థాయిలో అప్-డేట్ చేయాలని, అనంతరం గ్రూపుల్లోని సభ్యులందరికీ క్యూఆర్ కోడ్ కలిగిన ప్రత్యేక గుర్తింపు కార్డు జారీ చేయాలని సీఎస్ ఆదేశించారు. ప్రస్తుతం బ్యాంకుల ద్వారా పొందుతున్న వడ్డీ లేని రుణాల మొత్తాలను ఉత్పాదక రంగాలలో ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్వయం సహాయక బృందాల సభ్యులకు వివిధ రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించడం ద్వారా వారి ఆదాయ మార్గాలను పెంపొందించేందు చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేశ్ కుమార్ అన్నారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ అడిషనల్ కమీషనర్ శృతి ఓఝా, సెర్ప్ డైరెక్టర్ వై.ఎన్.రెడ్డి, శ్రీనిధి ఎండి విద్యాసాగర్, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + ten =