పార్లమెంటులో డిజిటిల్ బడ్జెట్.. ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

2022 Parliament Budget session, Budget Session, Budget Session-2022, Finance Minister, Finance Minister Nirmala Sitharaman, Finance Minister Nirmala Sitharaman To Be Presented Digital Budget, Finance Minister Nirmala Sitharaman To Be Presented Digital Budget in Parliament, Mango News, Nirmala Sitharaman, Nirmala Sitharaman To Be Presented Digital Budget in Parliament, Parliament, Parliament Budget Session, parliament budget session highlights, Parliament Budget Session News

కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో సమర్పించనున్నారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఈసారి బడ్జెట్ కూడా డిజిటల్ రూపంలోనే ఉండనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి కారణంగా పన్ను ప్రతిపాదనలు, ఆర్థిక నివేదికల ప్రదర్శనకు సంబంధించిన అన్ని పత్రాలు ముద్రించడం జరుగుతుంది. అయితే, కరోనా నేపథ్యంలో ఈసారి కూడా డిజిటల్ రూపంలోనే బడ్జెట్‌ను ముద్రించనున్నారు. ఈసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన నాలుగో బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2022న ప్రవేశపెట్టనున్నారు.

ఆర్థిక శాఖ అధికారుల సమాచారం ప్రకారం.. బడ్జెట్ పత్రంలో సాధారణంగా పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి ప్రసంగం, ముఖ్యాంశాలు, వార్షిక ఆర్థిక నివేదిక, పన్ను ప్రతిపాదనలతో కూడిన ఆర్థిక బిల్లు, ఆర్థిక బిల్లులోని నిబంధనలను వివరించే మెమోరాండం, స్థూల ఆర్థిక ఫ్రేమ్‌వర్క్ వివరాలు ఉంటాయి. ఈసారి బడ్జెట్ పత్రాలు ఎక్కువగా డిజిటల్ రూపంలోనే అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. భౌతికంగా కొన్ని కాపీలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =