దాణా కుంభకోణం ఐదవ కేసులో.. లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సిబిఐ కోర్ట్

Fodder Scam CBI Court Sentences 5 Years Imprisonment To Bihar Ex-CM Lalu Prasad Yadav, CBI Court Sentences 5 Years Imprisonment To Bihar Ex-CM Lalu Prasad Yadav, CBI Court Announces 5 Years Imprisonment To Lalu Prasad, CBI Court, Bihar Ex-CM Lalu Prasad Yadav, Bihar Ex-CM, Lalu Prasad Yadav, 5 Years Imprisonment To Lalu Prasad, 5 Years Imprisonment To Lalu Prasad In 5th Fodder Scam Case, 5 Years Imprisonment To Lalu Prasad In 5th Fodder Scam Case Of Rs 139.35 Cr, 5th Fodder Scam Case Of Rs 139.35 Cr, Fodder Scam Case Of Rs 139.35 Cr, Central Bureau of Investigation, CBI sentenced Rashtriya Janata Dal President Lalu Prasad Yadav to five years imprisonment, Rashtriya Janata Dal President, RJD, Rashtriya Janata Dal President Lalu Prasad Yadav, 5 Years Imprisonment, Lalu Prasad, Mango News, Mango News Telugu, 5 Years Imprisonment To Bihar Ex-CM Lalu Prasad Yadav, Fodder Scam,

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు రాంచీలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రత్యేక కోర్టు ఈరోజు ఐదేళ్ల శిక్ష విధించింది. ₹ 139 కోట్ల మేత కుంభకోణం కేసులో ఫిబ్రవరి 15న, ఆయనపై జరిగిన ఈ ఐదవ దాణా కుంభకోణం కేసులో సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి సికె శశి అతన్ని దోషిగా నిర్ధారించారు. IPCలోని సెక్షన్ 409, 420, 467, 468, 471 r/w 120B మరియు అవినీతి నిరోధక చట్టం, 1988లోని సెక్షన్ 13(2) ప్రకారం యాదవ్‌ను దోషిగా నిర్ధారించారు. అప్పటి బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ యాదవ్‌కు దీని గురించి తెలిసినా.. ఆయన ఈ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని సీబీఐ పత్రాలను సమర్పించింది. లాలూ యాదవ్‌ను నిందితుడిగా చేర్చిన ఐదు దాణా కుంభకోణం కేసుల్లో ఇదే చివరిది. మిగిలిన నాలుగు కేసుల్లో లాలూకు ఇదివరకే 14 సంవత్సరాల జైలు శిక్ష పడింది.

కాగా, ఇప్పటివరకు డోరండా ట్రెజరీ కుంభకోణం కేసులో మొత్తం 170 మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో 55 మంది మరణించారు, ఏడుగురు ప్రభుత్వ సాక్షులుగా మారగా.. ఆరుగురు పరారీలో ఉన్నారు. మరో ఇద్దరు వారిపై అభియోగాలను అంగీకరించారు. లాలూ ప్రసాద్ యాదవ్‌ బీహార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మొత్తం 950 కోట్ల రూ. దాణా స్కామ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు రాగా.. దొరండా ట్రెజరీ కేసులో 139.35 కోట్ల మేర స్కామ్‌ జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. అయితే, మొత్తం 99 మందిలో 24 మందిని నిర్ధోషులుగా విడుదల చేయగా.. 46 మందికి గతవారం సీబీఐ ప్రత్యేక కోర్టు మూడేళ్ల జైలు శిక్ష ఖారు చేసింది. లాలూకు మాత్రం ఐదేళ్ల జైలు శిక్షతోపాటు ₹60 లక్షల జరిమానా కూడా విధించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 4 =