ప్రధాని మోదీపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

Former PM Manmohan Singh Blasts PM Modi He is Still Blaming First Prime Minister Nehru, Former PM Manmohan Singh Blasts PM Modi, Modi is Still Blaming First Prime Minister Nehru, First Prime Minister Nehru, Former PM Manmohan Singh, Former Prime Minister Manmohan Singh, Prime Minister Manmohan Singh, Manmohan Singh, PM Modi, Former PM Manmohan Singh Blasts PM Modi, PM Manmohan Singh Blasts PM Modi, Prime Minister, Prime Minister Of India, Prime Minister Of India Modi, Mango News, Mango News Telugu,

మితభాషి అయిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం ప్రధాని నరేంద్ర మోదీ పైనా, ఆయన ప్రభుత్వం పైనా తీవ్రంగా మండిపడ్డారు. ఈరోజు (గురువారం) విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో ఆయన ప్రధాని మోదీ చర్యలను తప్పుబట్టారు. ప్రధాని ప్రతి సమస్యకు జవహర్‌లాల్ నెహ్రూను నిందిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఎన్నడూ దేశాన్ని విభజించలేదని, నిజాన్ని దాచలేదని 89 ఏళ్ల మన్మోహన్ సింగ్ అన్నారు. ఒకవైపు ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యతో ప్రజలు సతమతమవుతుంటే, మరోవైపు గత ఏడున్నరేళ్లుగా అధికారంలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వం తమ తప్పులను ఒప్పుకుని సరిదిద్దుకోకుండా, తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను నిందిస్తూనే ఉంది.

బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఆర్థిక విధానంపై అవగాహన లేదు. ఈ సమస్య దేశానికే పరిమితం కాదు. విదేశాంగ విధానంపై కూడా ఈ ప్రభుత్వం విఫలమైంది. చైనా మన సరిహద్దుల వద్ద కూర్చుని చొరబాటుకు ప్రయత్నాలు చేస్తోంది. వారి నకిలీ జాతీయవాదం వలన నేడు ప్రజలు విభజింపబడుతున్నారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను విభజించి పోరాడేలా చేస్తున్నారన్నారు. విభజించి పాలించు అనే బ్రిటిష్ విధానంతో రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తూనే ఉన్నారు అని మన్మోహన్ సింగ్ అన్నారు. అని మన్మోహన్ సింగ్ అన్నారు.

నాయకులను బలవంతంగా కౌగిలించుకోవడం, చేతులు కలపడం లేదా వారికి బిర్యానీ తినిపించడం ద్వారా విదేశాంగ విధానాన్ని నిర్వహించలేమని ప్రధాని మోదీ అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. ప్రధాన మంత్రి పదవికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని నేను భావిస్తున్నాను. చరిత్రను, ఎప్పుడో జరిగిపోయిన తప్పులను తక్కువ చేసి చూపడం కంటే ప్రధాని గౌరవాన్ని కాపాడుకోవాలి. నేను 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, నా పని ద్వారా నేను మాట్లాడాను. ప్రపంచం ముందు దేశం ప్రతిష్టను కోల్పోనివ్వలేదు. అలాగే, నేను భారతదేశం యొక్క గౌరవాన్ని ఎప్పుడూ తగ్గించలేదు అని మన్మోహన్ చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − eight =