టీ20 వరల్డ్‌కప్: నేడు బంగ్లాదేశ్‌తో తలపడనున్న భారత్, పొంచి ఉన్న వరుణుడి ముప్పు?

ICC T20 World Cup 2022 India To Play Match Against Bangladesh Today But Rain Threat Looms at Adelaide, ICC T20 World Cup 2022, India Vs Bangladesh, IND Vs Bangladesh T20 World Cup 2022, T20 World Cup 2022, Mango News, Mango News Telugu, India Vs Bangladesh ICC T20 World Cup 2022, India vs Bangladesh Updates, India vs Bangladesh LIVE Score , T20 World Cup, India vs Bangladesh Rain Threat, India Vs Bangladesh Adelaide Stadium, T20 World Cup Latest News And Updates, Ind Ban Adelaide Weather Forecast Live

టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 గ్రూప్-2లో భాగంగా భారత్ నేడు నాలుగో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. బుధవారం అడిలైడ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి మ్యాచ్‌లో ఓడిపోయిన టీమిండియాకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ప్రస్తుతం భారత్ జట్టు 3 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో 4 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు బంగ్లాదేశ్ కూడా 3 మ్యాచ్‌లు ఆడి 4 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. అయితే మెరుగైన నెట్ రేట్ కారణంగా భారత్ బంగ్లాదేశ్ కంటే ఒక స్థానం ముందుంది. దీంతో ఇరు జట్లకూ కీలకంగా మారిన ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు సెమీఫైనల్‌లోకి వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది.

ఇక టీమిండియాకు వైస్‌కెప్టెన్‌ లోకేష్ రాహుల్‌ బ్యాటింగ్ ఆందోళన కలిగిస్తోంది. అతడు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో వరుసగా కేవలం 4,9,9 పరుగులే చేయగలిగాడు. అతడినుంచి జట్టు భారీ ఇన్నింగ్స్ కోరుకుంటోంది. మరోవైపు వెన్ను నొప్పితో బాధపడుతున్న వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ స్థానంలో రిషభ్ పంత్ జట్టులోకి రానున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో మ్యాచ్‌లో దీపక్‌ హుడా ప్రయోగం విఫలమవడంతో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌కు తిరిగి చోటు దక్కొచ్చు. అలాగే గత మ్యాచ్‌లో భారీ స్కోర్లు చేయలేకపోయిన కెప్టెన్ రోహిత్‌ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు. సూర్యకుమార్‌ యాదవ్ ఫుల్ ఫామ్ లో ఉండటం భారత్ కు అనుకూలాంశం. ఇక పేసర్లు భువనేశ్వర్‌, షమి, అర్ష్‌దీప్‌ అంచనాలకు తగ్గట్లే రాణిస్తున్నారు.

ఇదిలా ఉంటే మరోవైపు బంగ్లాదేశ్‌ జట్టు ఈ మ్యాచ్‌లో టీమిండియాకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ షకీబల్‌ హసన్ స్పష్టం చేశాడు. వరల్డ్‌కప్ గెలవడం తమకు ముఖ్యం కాదని, టీమిండియాకు షాక్ ఇవ్వడమే తమ ప్రధాన ఉద్దేశమని తేల్చి చెప్పాడు. ఓపెనర్‌ షంటో, మిడిలార్డర్‌లో అఫీఫ్‌, మొసాద్దెక్‌లు బ్యాటింగ్ భారం మోయనున్నారు. అయితే కెప్టెన్ షకీబల్‌ రాణించాల్సి ఉంది. బౌలింగ్‌లో టస్కిన్‌, ముస్తాఫిజుర్‌లు కీలకం కానున్నారు. దీంతో నేటి మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. మరికొన్ని గంటల్లోనే ఫలితం తేలిపోనుంది. భారత్ తన తదుపరి మ్యాచ్ జింబాబ్వేతో ఆడనుంది. ఇక ఈ మ్యాచ్ నేటి మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం కానుంది.

తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), రాహుల్‌, కోహ్లీ, సూర్యకుమార్‌, పంత్‌, పాండ్యా, అక్షర్‌, అశ్విన్‌/చాహల్‌, భువనేశ్వర్‌, షమి, అర్ష్‌దీప్‌.

బంగ్లాదేశ్‌: షంటో, సౌమ్య సర్కార్‌, లిట్టన్‌ దాస్‌, షకీబల్‌ (కెప్టెన్‌), అఫీప్‌ హొస్సేన్‌, మొసద్దెక్‌ హొస్సేన్‌, నురుల్‌ హసన్‌, ముస్తాఫిజుర్‌, హసన్‌ మహ్ముద్‌, టస్కిన్‌ అహ్మద్‌.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 6 =