భారత్ vs శ్రీలంక తొలి టెస్ట్: మూడు రోజుల్లోనే గెలుచుకున్న టీమిండియా

Ind vs SL 1st Test Ravindra Jadeja And Ravichandran Ashwin Plays Key Role in India's Victory, Ravindra Jadeja And Ravichandran Ashwin Plays Key Role in India's Victory, IND vs SL, India, India Cricket Live News, India Cricket Live Updates, Sri Lanka, Sri Lanka Cricket Live News, Sri Lanka Live Updates, India vs Sri Lanka, India vs Sri Lanka Latest News, India vs Sri Lanka Latest Updates, India vs Sri Lanka Test Match Updates, India vs Sri Lanka Test Match Live Updates, IND vs Sri Lanka 1st Test Match Latest News, Test Match 2022 Live Updates, Test Match 2022 News, Test Match 2022 Updates, Sri Lanka national cricket team Updates, Sri Lanka national cricket team Live Updates, Cricket, Cricket Latest News, Cricket Latest Updates, Mango News, Mango News Telugu,

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ లో టీమిండియా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 574/8 వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక జడేజా, అశ్విన్, బుమ్రా చెలరేగి బౌలింగ్ చేయటంతో 174 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో నలుగురు ఆటగాళ్లు డకౌట్ కావడం గమనార్హం. దీంతో ఫాలో ఆన్‌ ఆడాల్సిన అవసరం ఏర్పడింది.

అయితే, ఫాలో ఆన్‌లోనూ లంక బ్యాటర్లు చేతులెతేయడంతో రెండో ఇన్నింగ్స్ లో 178 పరుగులకు ఆలౌట్ అయింది. భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. ఈ టెస్టులో చెలరేగి ఆడాడు. మొదట బ్యాటింగ్ లో 175 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆ తర్వాత లంక మొదటి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు సాధించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ లోనూ 4 వికెట్లు తీసి మొత్తంగా మ్యాచ్ లో 9 వికెట్లు పడగొట్టాడు. అలాగే, మరో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మొదటి ఇన్నింగ్స్ లో 1 వికెట్.. రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీసాడు. టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 14 =