దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో కలిపి 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జనవరి 8, ఆదివారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,79,924 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో 2 మరణాలు (కేరళలో రికాంసైల్డ్ 2) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,720కి పెరిగింది. ఇక దేశంలో గత 24 గంటల్లో 1,56,040 కరోనా పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజీటివిటీ రేట్ 0.10 శాతంగా నమోదైంది.
అలాగే మరో 247 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,46,781 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.80 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 2,423 (0.01%) మంది చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్, వంటి రాష్ట్రాల్లోనే కొత్త కరోనా కేసుల నమోదు కొంత ఎక్కువుగా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE