తెలంగాణలో వచ్చే 4 వారాలు కీలకం – డీహెచ్ శ్రీనివాస రావు

Next 4 weeks Crucial for Fight Against Covid-19 Warns Telangana DH Srinivasa Rao,Covid-19,Covid-19 Live Updates,Mango News,Mango News Telugu,Coronavirus,Coronavirus Updates,Covid-19 New Guidelines,Up Coming 4 weeks crucial for fight against Covid-19,Covid-19 Latest News,Covid-19 Latest Updates,Telangana DH Srinivasa Rao,Covid-19 New Updates,Coronavirus India,Telangana,Telangana Covid-19 News,Telangana Covid-19 Updates,Covid-19 Latest Updates,Omicron, Omicron covid variant, Omicron variant, Omicron Variant Cases in Telangana,Telangana Health Director Srinivasa Rao Press Meet ,DH Srinivasa Rao Press Meet,Telangana Health Director

తెలంగాణలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. వచ్చే నాలుగైదు వారాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు డీహెచ్ శ్రీనివాస రావు. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. వైరస్‌ జన సమూహంలోకి వ్యాపించిందన్న అనుమానాలు వైద్యశాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. గతవారం నుంచి ప్రతిరోజు రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీనిపై డీహెచ్ శ్రీనివాస రావు మాట్లాడారు. ప్రజలంతా తప్పనిసరిగా ఇంట్లోనూ, బయటా కూడా మాస్కులు ధరించాలని కోరారు. వాక్సిన్ తీసుకోవాల్సిన వారు వెంటనే తీసుకోవాలి. సంక్రాంతికి కేసులు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరికైనా లక్షణాలుంటే సొంత వైద్యం చేసుకోకుండా తప్పనిసరిగా వైద్యులను కలవాలని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యులకు, సిబ్బందికి సెలవులు రద్దు చేస్తు నిర్ణయం తీసుకుంది. గడిచిన 24 గంటలలో తెలంగాణలో 1520 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్‌ వ్యాప్తితోనే కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 40 శాతం ఒమిక్రాన్‌ వేరియంట్ కేసులు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఇప్పటికే థర్డ్‌వేవ్‌ వచ్చేసినట్లే అని అధికారులు ప్రజలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో అధికారులు బెడ్‌లను సిద్ధం చేస్తున్నారు. ఆక్సిజన్‌ కొరత లేకుండా కూడా అధికారులు చర్యలు చేపట్టారు. దాదాపు కోటి వరకు హోమ్‌ ఐసోలేషన్‌ కిట్‌లను కూడా పంపిణికి సిద్ధం చేస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇంటింటికి వెళ్లి మరోసారి ఫీవర్‌ సర్వే చేయాలని అధికారులు భావిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 1 =