రాజ్యసభ ఎన్నికల బరిలోకి సోనియా గాంధీ

Sonia gandhi, Priyanka gandhi, Rahul gandhi, Rajya sabha elections, lok sabha elections, National Politics, Indian Politics, Indian Political News, National Political News, Latest Indian Political News, congress, congress party, 2024 politics, Mango News Telugu, Mango News
Sonia gandhi, Priyanka gandhi, Rahul gandhi, Rajya sabha elections

కొద్దిరోజులుగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి సంబంధించి రకరకాల ఊహాగాణాలు వెలువడుతున్నాయి. ఈసారి సోనియా గాంధీ లోక్ సభకు కాకుండా.. రాజ్యసభకు పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఆ ప్రచారమే నిజమయింది. సోనియా గాంధీ రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం 78 సంవత్సరాల వయసున్న సోనియా గాంధీ అనారోగ్య కారణాలతో రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బుధవారం సోనియా గాంధీ నామినేషన్ దాఖలు చేశారు.

ఇప్పటి వరకు అయిదు సార్లు ఎన్నికల్లో గెలుపొంది సోనియా గాంధీ లోక్ సభకు ఎన్నికయ్యారు. కానీ వయసు మీద పడడంతో కొద్దిరోజులుగా సోనియా తరచూ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కొద్దిరోజుల క్రితం కూడా అస్వస్థతకు గురికావడంతో.. ఆమె ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈకారణాల చేత ఈసారి లోక్ సభ కాకుండా.. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని సోనియా గాంధీ, కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ కూడా సోనియా గాంధీకి రాజ్యసభ టికెట్ కేటాయించింది.

వచ్చే ఎన్నికల్లో జైపూర్ రాజ్యసభ స్థానం నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆ స్థానానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రాతినిధ్యం వహించారు. ఇటీవలే ఆయన పదవీకాలం ముగిసింది. దీంతో ఆ స్థానం నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తున్నారు. బుధవార ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సోనియా గాంధీ జైపూర్‌కు వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం రాజస్థాన్‌లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వగా.. అందులో ఒక్క స్థానాన్ని కాంగ్రెస్ కచ్చితంగా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఈక్రమంలో ఆ స్థానం నుంచే సోనియా గాంధీ పోటీ చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఐయిదు సార్లు లోక్ సభకు ఎన్నికైన సోనియా గాంధీ.. ఈ ఎన్నికల్లో గెలిస్తే తొలిసారి రాజ్యసభలో అడుగుపెడుతారు. గతంలో ఇందిరాగాంధీ కూడా రాజ్యసభ ఎన్నికల్లో గెలుపొంది రాజ్యసభలో అడుగుపెట్టారు. గాంధీ కుటుంబం నుంచి ఇందిరాగాంధీ తర్వాత రాజ్యసభలో అడుగుపెడుతున్న రెండో వ్యక్తిగా సోనియా గాంధీ నిలిచారు.

మరోవైపు ఇప్పటి వరకు కూడా సోనియా గాంధీ ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయ్ బరేలీ నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు అయిదు సార్లు ఆ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఇప్పుడు సోనియా గాంధీ రాజ్యసభకు పోటీ చేస్తుండడంతో.. రాయ్ బరేలీ నుంచి లోక్ సభకు ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో ప్రియాంక గాంధీ తెరపైకి వచ్చింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాయ్ బలేరీ నుంచి ప్రియాంకగాంధీ లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగనున్నారట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =