నాలుగో వేవ్ నేపథ్యంలో కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం పలు కీలక సూచనలు

Covid-19 Cases Surge in Southeast Asia Europe Centre Asks States to Continue Focus on Five-fold Strategy, Covid-19 Cases Surge in Southeast Asia Centre Asks States to Continue Focus on Five-fold Strategy, Covid-19 Cases Surge in Europe Centre Asks States to Continue Focus on Five-fold Strategy, Five-fold Strategy, Five-fold Strategy in Southeast Asia, Five-fold Strategy in Europe, Covid-19 Cases Surge in Europe, Covid-19 Cases Surge in Southeast Asia, Covid-19 Cases Surge, Covid-19 Updates, Covid-19 Live Updates, Covid-19 Latest Updates, Coronavirus, coronavirus Latest Updates, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, Mango News, Mango News Telugu,

దేశంలో ఒమిక్రాన్‌ కరోనా వేరియంట్ వ్యాప్తి అనంతరం, గత కొన్ని రోజులుగా మళ్ళీ కొత్త కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో అన్ని సామాజిక కార్యకలాపాలు, ఆర్థిక పునరుద్ధరణకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ మరోసారి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు మరియు కేంద్రపాలిత ప్రాంతాల అధికార యంత్రాంగాలకు లేఖ రాసి పలు కీలక సూచనలు చేశారు.

సౌత్ ఈస్ట్ ఆసియా మరియు యూరప్‌లోని కొన్ని దేశాల్లో మళ్ళీ కరోనా కేసుల పెరుగుతుండడంతో గురువారం నాడు కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిందని తెలిపారు. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు దూకుడుగా వ్యవరించాలన్నారు. జినోమ్ సీక్వెన్సింగ్ పై దృష్టి పెట్టాలని, పూర్తి నిఘాతో కరోనా పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు. అలాగే టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్ మరియు కరోనాకు తగిన ప్రవర్తనకు కట్టుబడి ఉండటం అనే ఐదు అంశల వ్యూహంపై దృష్టిని కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇన్సకాగ్ నోడల్ ఏజెన్సీ అయిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ జారీ చేసిన ప్రోటోకాల్ ప్రకారం సెంటినెల్ సైట్‌ల ద్వారా తగిన సంఖ్యలో శాంపిల్స్ ను ఇన్సకాగ్ నెట్‌వర్క్‌కు సమర్పించేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలన్నారు. ఐసీఎంఆర్ పరీక్షల ప్రోటోకాల్‌ల ప్రకారం తగిన పరీక్షలను కొనసాగిస్తూ కొత్త వేరియంట్‌లను సకాలంలో గుర్తించడానికి రాష్ట్రాలు చర్యలు చేపట్టాలన్నారు.

యువకులకు వ్యాక్సిన్ అందించడం, పెద్దలందరికీ ప్రికాషన్ డోస్ వేయడం సహా అర్హులందరికీ పూర్తిస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ పూర్తిచేసేలా రాష్ట్రాలు ప్రణాళికలు అమలు చేయాలనీ చెప్పారు. ఫేస్ మాస్క్‌లు ధరించడం, అన్ని బహిరంగ ప్రదేశాలు/సమావేశాలలో భౌతిక దూరాన్ని కొనసాగించడం మరియు పరిశుభ్రత విషయంలో ప్రజలకు రాష్ట్ర యంత్రాంగాలు అవసరమైన అవగాహనను కలిగించాలన్నారు. కరోనా వ్యతిరేకంగా కొనసాగుతున్న సమిష్టి ప్రయత్నాలలో రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ మద్దతు కొనసాగుతుందని చెప్పారు. ఈ మహమ్మారిని అదుపులో ఉంచడానికి ఇప్పటి వరకు సాధించిన పురోగతిని కొనసాగించాలని, ఈ విషయంలో మరింత అభివృద్ధి సాధించగలమని ఖచ్చితంగా నమ్ముతున్నామని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =