హైదరాబాద్‌ చేరుకున్న 1.5 లక్షల స్పుత్నిక్‌-వి కరోనా వ్యాక్సిన్ డోసులు

1.5 Lakh Doses Of Sputnik-V Covid Vaccine Arrives In Hyderabad From Russia,Mango News,Mango News Telugu,First Batch Of 1.5 Lakh Doses Of Sputnik V Covid-19 Vaccine,India Gets 1.5 Lakh Doses Of Sputnikv Vaccine First Consignment From Russia,1.5 Lakh Doses Of Sputnik V Land In India,India Receives Over A Lakh Sputnik V Covid-19 Vaccine Doses,First Batch Of 1.5 Lakh Doses Of Sputnik V Covid-19 Vaccine Arrive In Hyderabad From Russia,1.5 Lakh Doses,Sputnik-V Covid Vaccine,Covid Vaccine,1.5 Lakh Doses Of Sputnik-V,Sputnik-V Vaccine,Hyderabad,Russia

రష్యా ఆర్‌డీఐఎఫ్‌ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి కరోనా వ్యాక్సిన్ మొదటి బ్యాచ్ శనివారం నాడు భారత్ కు చేరుకుంది. రష్యాలోని మాస్కో నుంచి ప్రత్యేక విమానంలో 1.5 లక్షల స్పుత్నిక్‌-వి కరోనా వ్యాక్సిన్ డోసులు హైదరాబాద్ కు చేరుకున్నాయి. మరో మూడు మిలియన్ల డోసులు కూడా ఈ నెలలోనే రానున్నట్టు తెలుస్తుంది. దేశంలో మూడోదశ వ్యాక్సినేషన్‌ లో భాగంగా 18-14 ఏళ్ల వారికీ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన నేపథ్యంలో కోవాక్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ లతో పాటుగా స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావడం ఊరట కల్గించనుంది.

ముందుగా రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్ కు సంబంధించి దేశంలో ఉత్పత్తి, అమ్మకాలపై డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. మూడో పేజ్ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న ఈ వ్యాక్సిన్ యొక్క అత్యవసర ఉపయోగం కోసం డాక్టర్ రెడ్డీస్ సంస్థ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కు దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్ సిఓ) నిపుణుల కమిటీ పరిశీలన చేసి ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతి కోసం డీసీజీఐకి సిఫార్సు చేసింది. అనంతరం డీసీజీఐ కూడా ఆమోదం తెలపడంతో దేశంలో వినియోగం కోసం ఆమోదం పొందిన మూడో వ్యాక్సిన్ గా స్పుత్నిక్‌-వి నిలిచింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 2 =