జీశాట్-30 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం

indian space research organisation, ISRO Latest News, ISRO Launches GSAT-30, ISRO Launches GSAT-30 From South America, Mango News Telugu, national news headlines today, national news updates 2020
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. జనవరి 17, శుక్రవారం తెల్లవారుజామున 2:35 గంటలకు దక్షిణ అమెరికాలోని ఈశాన్య తీరంలో ఉన్న ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్‌-5 వాహకనౌక ద్వారా జీశాట్‌ 30 ఉపగ్రహాన్ని ప్రయోగించి, 38 నిమిషాల్లో నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు. జీశాట్‌ 30 ఉపగ్రహం యొక్క బరువు 3357 కిలోలు. ఇది కమ్యూనికేషన్‌ ఉపగ్రహం. అధిక-నాణ్యత గల టెలివిజన్, టెలికమ్యూనికేషన్స్ మరియు ప్రసార సేవలను అందించే లక్ష్యంతో ఈ “హై పవర్” కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రవేశపెట్టింది. ఇన్‌శాట్‌- 4ఏ స్థానంలో సేవలందించేందుకు జీశాట్‌-30 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లుగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భారత్‌కు చెందిన హై పవర్ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్‌-30 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది.

 

[subscribe]

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 12 =