జేఈఈ మెయిన్-2022 రెండో విడత పరీక్షలు వాయిదా, ఎన్టీఏ ప్రకటన

JEE Main-2022 Session 2 Exams Postponed to Commence from July 25 Onwards, JEE Main-2022 Session 2 Exams to Commence from July 25 Onwards, JEE Main-2022 Session 2 Exams Postponed, JEE Main-2022 Session 2 Exams, Session 2 Exams Postponed, JEE Main-2022, 2022 JEE Main, JEE Main, JEE Main Admit Card 2022, JEE-Main 2022 second session postponed, JEE Main-2022 Session 2 Exams News, JEE Main-2022 Session 2 Exams Latest News, JEE Main-2022 Session 2 Exams Latest Updates, JEE Main-2022 Session 2 Exams Live Updates, Mango News, Mango News Telugu,

దేశంలో ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌-2022 పరీక్షలు ఈ ఏడాదికి గానూ రెండు విడతలు/సెషన్స్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జేఈఈ మెయిన్‌ మొదటి విడత పరీక్షలు జూన్‌ 23 నుంచి 29 వరకు నిర్వహించి, జూలై 11న ఫలితాలను వెల్లడించారు. కాగా రేపటి నుంచి (జూలై 21, గురువారం) నుంచి ప్రారంభమై జూలై 30 వరకు జరగాల్సిన జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం నాడు ఒక ప్రకటన చేసింది. పరీక్షల వాయిదాకు గల కారణాలను పేర్కొనలేదు. అయితే కొత్త షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలు జూలై 25 నుండి ప్రారంభమవుతాయని ఎన్టీఏ వెల్లడించింది.

జేఈఈ మెయిన్‌ రెండో విడతకోసం 6,29,778 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, దేశం వెలుపల ఉన్న 17 నగరాలతో సహా దేశంలోని దాదాపు 500 నగరాల్లోని వివిధ కేంద్రాలలో జూలై 25వ తేదీన పరీక్షలు ప్రారంభించబడతాయని తెలిపారు. జూలై 21, గురువారం నుంచి https://jeemain.nta.nic.in/ వెబ్‌సైట్‌లో అడ్మిట్‌ కార్డ్స్ అందుబాటులో ఉంటాయని ఎన్టీఏ పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − six =