లోక్ సభ ఎన్నికలు.. 300 స్థానాల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్

Lok Sabha Elections Congress To Contest In 300 Seats, Congress To Contest In 300 Seats, Lok Sabha Elections Congress, Lokh Sabha Elections, Congress, INDIA Alliance, Lokh Sabha Seats, Latest Congress Lok Sabha Elections News, Congress Lok Sabha Elections News Update, 300 Seats, Congress To Contest Lok Sabha Elections, Lok Sabha News, Telangana Lok Sabha Elections, TS CM Revanth Reddy, Polictical News, Elections, Mango News, Mango News
Lok Sabha Elections Congress To Contest In 300 Seats, Congress To Contest In 300 Seats, Lok Sabha Elections Congress, Lokh Sabha Elections, Congress, INDIA Alliance, Lokh Sabha Seats, Latest Congress Lok Sabha Elections News, Congress Lok Sabha Elections News Update, 300 Seats, Congress To Contest Lok Sabha Elections, Lok Sabha News, Telangana Lok Sabha Elections, TS CM Revanth Reddy, Polictical News, Elections, Mango News, Mango News

భారతీయ జనతా పార్టీని ఢీ కొట్టడమే లక్ష్యంగా.. ఎర్రకోటపై మూడు రంగల జెండాను ఎగుర వేయడమే ధ్యేయంగా ముందుకు కదులుతోంది కాంగ్రెస్ పార్టీ. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్.. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. ఇప్పటికే బీజేపీ సర్కార్‌ను గద్దె దించేందుకు మిత్ర పక్షాలతో కలిసి కాంగ్రెస్ ఇండియా కూటమిని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 28 విపక్ష పార్టీలు బీజేపీని ఢీ కొట్టేందుకు ఇండియా కూటమితో చేతులు కలిపాయి.

అయితే మరో మూడు, నాలుగు నెలల్లో దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో ఇప్పటి నుంచే ఇండియా కూటమి ఎన్నికలపై కంప్లీట్‌గా ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేస్తుంది.. మిత్ర పక్షాలకు ఎన్ని స్థానాలు ఇస్తుందనేది ఇన్నిరోజులు చర్చనీయాంశంగా మారింది. అయితే పోటీ చేయబోయే స్థానాలపై కాంగ్రెస్ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 543 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. వాటిలో 300 స్థానాల నుంచి పోటీ చేసి.. మిగిలిన 243 స్థానాల్లో మిత్రపక్షాలను బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది.

తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, కేరళ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, జార్ఖండ్ రాష్ట్రాల్లోని స్థానాల్లో మిత్ర పక్షాలతో పోటీ చేయించాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, అసోం, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో  ఒంటరిగా పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఆయారాష్ట్రాల్లో బీజేపీని, ప్రాంతీయ పార్టీలను ఒంటరిగా ఢీ కొట్టేందుకు సిద్ధమవుతోంది. సీట్ల పంపకాలపై ఆయా రాష్ట్రాల పార్టీ యూనిట్లతో చర్చించినాకే కాంగ్రెస్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 52 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అలాగే 209కి పైగా స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. అయితే ఈసారి ఎలాగైనా 150కి పైగా స్థానాల్లో గెలుపొంది తీరుతామనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్. అయితే ఎంత పొత్తు పెట్టుకున్నప్పటికీ.. సీట్ల పంపకాల వద్దే అసలు సమస్య తలెత్తుతుంటుంది. ఈక్రమంలో కాంగ్రెస్ నిర్ణయంపై మిత్ర పక్షాలు ఎలా స్పందిస్తాయనేది చూడాలి మరి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 8 =