ఆ నేతలపై వేటు వేసే యోచనలో కిషన్ రెడ్డి

ishan Reddy is Planning to Attack Those Leaders,Kishan Reddy is Planning to Attack,Planning to Attack Those Leaders,BJP action plan to win,Kishan reddy, Telangana BJP, Bandi sanjay, BJP Highcommand,G Kishan Reddy Alleges Malpractices,possibility of simultaneous polls,Mango News,Mango News Telugu,Kishan Reddy Latest News,Kishan Reddy Planning Latest Updates,Kishan Reddy Latest Updates
Kishan reddy, Telangana BJP, Bandi sanjay, BJP Highcommand

అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీకి షాక్ తగిలిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి అగ్రనేతలు తరలివచ్చి ఇక్కడ మకాం వేసినప్పటికీ.. ఊహించిన ఫలితాలు దక్కలేదు. కనీసం డబుల్ డిజిట్ ఫలితాలు కూడా రాలేదు. ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. మహామహులే ఓటమిపాలయ్యారు. పార్టీలో అంతర్గత విభేదాలే ఆశించిన ఫలితాలు రాకపోవటానికి ఒక కారణంమని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. ఇప్పటికే ఈ ఫలితాల పట్ల టి.బీజేపీ నేతలపై హైకమాండ్ ఆగ్రహంతో ఉంది.

ఫలితాల తర్వాత తెలంగాణకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యనేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో సమావేశమై సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా విభేదాలు మానుకోవాలని.. కలిసి పని చేయాలని సూచించారు. అయినప్పటికీ అలాగే ఉంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అలాగే ముందు ముందు.. పార్లమెంట్ ఎన్నికల వేళ అనుసరించాల్సిన వ్యూహాలు.. చర్యలపై నేతలపై చర్చలు జరిపారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా ఎలాగైనా తెలంగాణలో పదిసీట్లను దక్కించుకోవాలని టార్గెట్ పెట్టారట.

ఈక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలో సంస్థాగత ప్రక్షాళన చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పెద్ద ఎత్తున పార్టీ నేతలపై వేటు వేసేందుకు సిద్ధమయ్యారట. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరుపున పని చేయని నేతలకు షాక్ ఇవ్వడంతో పాటు.. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించాటరు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారి భరతం పట్టాలని కిషన్ రెడ్డి ఫిక్స్ అయ్యారట.

ఇప్పటికే ఎవరెవరికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలన్నది కూడా ఫిక్స్ చేశారట. మూడు జిల్లాల బీజేపీ అధ్యక్షులతో పాటు పది మంది రాష్ట్ర స్థాయి నేతలు, సీనియర్లు కూడా షోకాజ్ నోటీసులు అందుకునేవారి జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చాలా ఏళ్లుగా పార్టీ అధ్యక్ష పదవులు అనుభవిస్తూ.. పార్టీకి ప్రయోజనం చేకూరేలా ఏ పని చేయని వారిపై వేటు వేయాలని కిషన్ రెడ్డి నిర్ణయించారట. సుదీర్ఘ కాలంగా జిల్లా అధ్యక్ష పదవిలో ఉన్నవారికి అప్పగించిన పనులు, వారు సాధించిన విజయాలను పరిగణలోకి తీసుకొని మార్పులు చేయనున్నారట. అయితే ఇందులో ఎక్కువగా బండి సంజయ్‌కు అనుకూలంగా ఉన్నవారిపైనే వేటు ఉంటుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అలాగే 17 లోక్ సభ స్థానాల పరిధిలో పార్లమెంట్ కమిటీలన కూడా నియమించనున్నారట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 9 =