ప్రధాని మోదీ కేబినెట్‌లో కీలక మార్పులు.. అర్జున్ రామ్ మేఘ్వాల్‌కు న్యాయశాఖ, కిరెన్ రిజిజుకు ఎర్త్ సైన్సెస్ కేటాయింపు

Modi Cabinet Reshuffle Arjun Ram Meghwal Appointed as Law Minister and Kiren Rijiju Assigned Ministry of Earth,Modi Cabinet Reshuffle,Arjun Ram Meghwal Appointed as Law Minister,Kiren Rijiju Assigned Ministry of Earth,Mango News,Mango News Telugu,New Union Law Minister,Cabinet reshuffle,Union cabinet reshuffle,Kiren Rijiju Replaced,Arjun Ram Meghwal replaces Kiren Rijiju,Modi cabinet reshuffle,Union cabinet reshuffle 2023,Arjun Ram Meghwal Latest News,Arjun Ram Meghwal Latest Updates,Arjun Ram Meghwal Live News,Arjun Ram Meghwal News Today,Indian Politics, Indian Political News, National Political News,Shri Arjun Ram Meghwal,Modi Cabinet Reshuffle Latest News,Modi Cabinet Reshuffle Latest Updates,Kiren Rijiju Shifted Out From Law Ministry,Kiren Rijiju Latest News

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం అనూహ్యంగా కేంద్ర కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ చేసింది. ఈ మేరకు ఈ ఉదయం రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. అర్జున్ రామ్ మేఘ్వాల్‌కు న్యాయశాఖ మంత్రిగా మరియు కిరెన్ రిజిజుకు భూమి మంత్రిత్వ శాఖ కేటాయించబడింది. ప్రస్తుతం న్యాయ మంత్రిగా ఉన్న కిరెన్ రిజిజును ఆ శాఖ నుంచి తప్పించింది. ఆయన స్థానంలో కొత్తగా బీజేపీ సీనియర్ నేత అర్జున్ రామ్ మేఘ్వాల్‌ను నియమించింది. అలాగే కిరెన్ రిజిజుకు ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పోర్ట్‌ఫోలియోను కేటాయించింది. కాగా అరుణాచల్ ప్రదేశ్ నుంచి లోక్ సభ ఎంపీ అయిన రిజిజు జూలై 2021లో రవిశంకర్ ప్రసాద్ స్థానంలో న్యాయశాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఆయన గతంలో ప్రధాని మోదీ క్యాబినెట్‌లో మైనారిటీ వ్యవహారాల మంత్రిగా, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిగా పనిచేశారు. ఇక ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాలు మరియు సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న మేఘ్వాల్‌కు న్యాయ మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించబడ్డాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 3 =