భారతదేశ నూతన ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్, ఎన్నికల్లో ఘన విజయం

NDA Candidate Jagdeep Dhankar Elected as 16th Vice President of India, Jagdeep Dhankar Elected as 16th Vice President of India, NDA Candidate Elected as 16th Vice President of India, 16th Vice President of India, NDA Candidate Jagdeep Dhankar, Jagdeep Dhankar, NDA Candidate, 16th Vice Presidential Elections Voting Begins, 16th Vice Presidential Elections, Vice Presidential Elections 2022, 2022 Vice Presidential Elections, Vice Presidential Elections, Jagdeep Dhankhar, Vice Presidential Poll, Margaret Alva vs Jagdeep Dhankhar faceoff today, Voting to elect the next Vice President of India, Vice Presidential elections Polling today, Vice Presidential Elections Voting News, Vice Presidential Elections Voting Latest News, Vice Presidential Elections Voting Latest Updates, Vice Presidential Elections Voting Live Updates, Mango News, Mango News Telugu,

భారతదేశ నూతన ఉపరాష్ట్రపతిగా అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్కర్ ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాపై 346 ఓట్ల తేడాతో జగదీప్ ధన్కర్ ఘన విజయం సాధించారు. పోలైన 725 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లలో 528 ఓట్లు జగదీప్ ధన్కర్ కు రాగా, విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వాకు 182 ఓట్లు వచ్చాయి. కాగా 15 ఓట్లు చెల్లలేదని లోక్ సభ జనరల్ సెక్రటరీ ఉత్పల్ కె సింగ్ తెలిపారు. ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10, 2022తో ముగియనుండగా, ఆగస్టు 11న నూతన ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ప్రమాణ స్వీకారం చేసి, పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

ముందుగా ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. ఎలెక్టోరల్ కాలేజీలో మొత్తం 780 మంది ఎంపీలు ఉండగా, 725 మంది ఎంపీలు ఓటు వేశారని, 92.94 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. కౌంటింగ్ అనంతరం 725 ఓట్లలో 528 ఓట్లు జగదీప్ ధన్కర్ కు రావడంతో ఆయనను భారతదేశ నూతన ఉపరాష్ట్రపతిగా ప్రకటించారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్ ధన్కర్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =