వరుసగా నాలుగోసారి బంగ్లాదేశ్ ప్రధానిగా హసీనా షేక్

Hasina Sheikh Is The Prime Minister Of Bangladesh For The Fourth Time In A Row, Hasina Sheikh Is The Prime Minister Of Bangladesh, Prime Minister Of Bangladesh, Hasina Sheikh Fourth Time Prime Minister, Fourth Time Bangladesh Prime Minister, Bangladesh, Hasina Sheikh, Bangladesh Parliament Elections, Latest Bangladesh Elections News, Bangladesh Elections 2024, Mango News, Mango News Telugu
Bangladesh, Hasina Sheikh, Bangladesh parliament elections,

బంగ్లాదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి అవామీ లీగ్ పార్టీ ఘన విజయం సాధించింది. మూడింట రెండు వంతుల మెజార్టీ సాధించి విజయ దుందుభి మోగించింది. దీంతో వరుసగా నాలుగోసారి  షేక్ హసీనా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇప్పటి వరకు హసీనా నాలుగుసార్లు బంగ్లాదేశ్ ప్రధానిగా పని చేయగా.. అందులో మూడుసార్లు వరుసగా పదవిని చేపట్టారు. ఇప్పుడు వరుసగా నాలుగోసారి హసీనా అధికారం చేపట్టడం ఖరారయింది. 2009 నుంచి హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా కొనసాగుతున్నారు.

ఈ ఎన్నికల్లో హసీనా తన సొంత నియోజకవర్గమైన గోపాల్‌గంజ్-3 నుంచి పోటీ చేసి గెలుపొందారు. తన ప్రత్యర్థి బంగ్లాదేశ్ సుప్రీం పార్టీ అభ్యర్థి నిజాముద్దీన్‌ లష్కర్‌ను హసీనా చిత్తుచిత్తుగా ఓడించారు. హసీనాకు 2,49,965 ఓట్లు పోలవ్వగా.. నిజాముద్దీన్‌కు కేవలం 469 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. గోపాల్ గంజ్-3 నియోజకవర్గం నుంచి హసీనా గెలుపొందడం వరుసగా ఇది 8వ సారి కావడం గమనార్హం.

ఇకపోతే బంగ్లాదేశ్‌లో మొత్తం 300 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. అందులో 299 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఒకస్థానంలో అభ్యర్థి మరణించడంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి.  ఈసారి 17 పార్టీల నుంచి 1500 మందికిపైగా అభ్యర్థులు.. స్వతంత్రంగా 436 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈసారి ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సహా మొత్తం 15 పార్టీలు ఎన్నికలను బహిష్కరించాయి. దీంతో పోలింగ్ కూడా అతి తక్కువ శాతం నమోదయింది. పోయినసారి ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి కేవలం 40 శాతం ఓటింగ్ మాత్రమే నమోదయింది.

ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం షేక్ హసీనా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలకు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామని చెప్పారు. ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జమాత్ ఇ ఇస్లామీ కూటమికి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదని ఆరోపించారు. భారత్ తమకు అత్యంత నమ్మకమైన మిత్రదేశమన్న హసీనా.. ఆ దేశం తమ పొరుగున ఉన్నందుకు తాము చాలా అదృష్టవంతులమని వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =