ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో ఓట‌మికి గాంధీ కుటుంబ‌మే కాదు, కాంగ్రెస్ పార్టీ నేత‌లంతా బాధ్యులే – సీనియర్ నేత మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే

Not Just Gandhis Every Congress Leader Responsible For The Defeat in 5 States Says Mallikarjun Kharge, Mallikarjun Kharge Says Not Just Gandhis Every Congress Leader Responsible For The Defeat in 5 States, Mallikarjun Kharge, Poll Results of UP Punjab Goa Uttarakhand Manipur 2022 Assembly Elections, Poll Results, Poll Results of UP, Poll Results of Punjab, Poll Results of Goa, Poll Results of Uttarakhand, Poll Results of Manipur, Poll Results of UP 2022 Assembly Elections, Poll Results of Punjab 2022 Assembly Elections, Poll Results of Goa 2022 Assembly Elections, Poll Results of Uttarakhand 2022 Assembly Elections, Poll Results of Manipur 2022 Assembly Elections, Election 2022, Assembly Election, Assembly Election 2022, 2022 Assembly Election, Assembly Elections, Assembly Elections Latest News, Assembly Elections Latest Updates, Assembly Elections Live Updates, 2022 Assembly Elections, Assembly Elections, Elections, Mango News, Mango News Telugu,

ఐదు రాష్ట్రాలలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం ఎదురైన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే సోమవారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని సమర్థించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి అగ్ర నాయకత్వం ఒక్కటే కారణం కాదని, పార్టీలోని ప్రతి నాయకుడు బాధ్యత వహించాలని ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే సోమవారం అన్నారు. పార్టీ వైఫల్యానికి అనేక కారణాలున్నాయని ఖర్గే తెలిపారు. ఈ వైఫల్యానికి గాంధీ కుటుంబమే కాదు, ప్రతి రాష్ట్ర నాయకుడు, ఎంపీ బాధ్యత వహిస్తారని ఆయన అన్నారు. సోనియా గాంధీపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉందని, ఆమె రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

మార్చి 10న ప్ర‌క‌టించిన పంజాబ్‌, గోవా, యూపీ, మ‌ణిపూర్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట‌మి పాలైన సంగ‌తి తెలిసిందే. నిన్న (ఆదివారం) జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం గురించి ఖర్గే నేడు మీడియాతో మాట్లాడుతూ.. సమావేశంలో పార్టీని బలోపేతం చేసే వ్యూహాలపై చర్చించినట్లు చెప్పారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) మరియు దాని సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని, వచ్చే ఎన్నికల్లో మరింత మెరుగ్గా రాణిస్తామని అన్నారు. నిన్న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు భూపేష్ బాఘేల్, అశోక్ గెహ్లాట్, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ వంటి అగ్రనేతలు హాజరయ్యారు.

ఐదు రాష్ట్రాలలో పరాజయం పాలైన కొద్ది రోజుల తరువాత సమావేశమైన కాంగ్రెస్ నాయకులు.. పార్టీ ప్రయోజనాల కోసం ప్రస్తుత పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంస్థాగత ఎన్నికల వరకు కొనసాగాలని కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ ఆదివారం ఏకగ్రీవంగా నిర్ణయించింది. దాదాపు ఐదు గంటలపాటు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఆమె నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉంచింది. అలాగే, పార్టీని బలోపేతం చేయడానికి మరియు భవిష్యత్తులో ఎదుర్కోబోయే ఎన్నికలకు ముందుగా పార్టీలో కొన్ని దిద్దుబాటు చర్యలు చేయాలని ఆమెను కోరింది. కాంగ్రెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా మాట్లాడుతూ.. ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త, నాయకుడు రాహుల్‌ గాంధీ పార్టీని నడిపించాలని కోరుకుంటున్నారని, అయితే సంస్థాగత ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నందున, తదుపరి అధ్యక్షుడిని దాని ద్వారానే నిర్ణయిస్తామని అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − seventeen =