కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ రవాణా ప్రారంభం, హైదరాబాద్‌ నుంచి 11 నగరాలకు…

Bharat Biotech, Bharat Biotech Covaxin Vaccine, Bharat Biotech Covaxin Vaccine Distribution, Bharat Biotech Covaxin Vaccine Distribution In India, Coronavirus, coronavirus vaccine, Coronavirus Vaccine News, Coronavirus Vaccine Updates, Covaxin Vaccine, Covaxin Vaccine Dispatches to 11 Cities, Covaxin Vaccine Dispatches to 11 Cities from Hyderabad, Covaxin Vaccine Distribution, Covaxin Vaccine Distribution In India, Hyderabad, Mango News Telugu

భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేసిన “కొవాగ్జిన్‌” కరోనా వ్యాక్సిన్ కు దేశంలో అత్యవసర వినియోగానికి ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ మొదటివిడత రవాణాను బుధవారం నాడు భారత్‌ బయోటెక్‌ సంస్థ ప్రారంభించింది. కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ డోసులు హైదరాబాద్‌ నుంచి మొత్తం 11 నగరాలకు బయల్దేరాయి. ఢిల్లీ, విజయవాడ, లక్నో, పట్నా, చెన్నై, జైపూర్, కురుక్షేత్ర, భువనేశ్వర్, గౌహతి, బెంగళూరు, పూణేలకు నగరాలకు వరుసగా చేరుకోనున్నాయి.

మరోవైపు కొవాగ్జిన్ వ్యాక్సిన్ 55 లక్షల డోసులుకు సంబంధించి భారత్‌ బయోటెక్ సంస్థతో‌ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ మంగళవారం ప్రకటించారు. ఇందులో 16.5 లక్షల డోసులను ప్రభుత్వానికి భారత్ బయోటెక్ ఉచితంగా అందిస్తున్నదని, మిగిలిన 38.5 లక్షల డోసులకు పన్నులు మినహాయించి ఒక్కో డోసుకు రూ.295 ధరతో కొనుగోలు చేస్తునట్టు తెలిపారు. ఇక శనివారం నుంచే కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభం కానుండడంతో వ్యాక్సిన్ రవాణాతో పాటుగా అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =