9.48 లక్షల రైతులకు రూ.1252 కోట్ల బీమా పరిహారం : సీఎం వైఎస్ జగన్

AP CM YS Jagan Launches YSR Free Crop Insurance Scheme Today,AP News,Telangana News,Free Crop Insurance,AP Govt,CM Jagan Govt,Farmer Welfare Schemes,Crop Insurance In AP,CM Jagan,CM Jagan Launches Free Crop Insurance Scheme,YS Jagan Mohan Reddy,Crop Insurance,Farmer,YSR Uchitha Pantala Bheema Scheme,Amaravati,CM YS Jagan To Distribute YSR Free Crop Insurance To Farmers,YSR Panta Bheema,CM YS Jagan To Distribute YSR Free Crop Insurance To Farmers,Jagan YSR Panta Bheema,AP CM YS Jagan,Cm Jagan,CM Jagan Panta Bheema,YSR Panta Bheema Latest Update,YSR Panta Bheema News Today,CM YS Jagan Panta Bheema,CM Jagan Live Today,CM Jagan YSR Panta Bheema Live,Jagan Panta Bheema Latest News,YSR Panta Bheema Latest News Today,Jagan On YSR Panta Bheema

ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి మంగళవారం నాడు మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో రైతాంగానికి భరోసానివ్వడంలో భాగంగా “వైఎస్ఆర్ పంటల బీమా” పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ పథకం కింద 2019 సీజన్‌లో పంట నష్టపోయిన 9.48 లక్షల రైతులకు దాదాపుగా రూ.1252 కోట్ల బీమా పరిహారం అందించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో నేరుగా ఆ నగదును జమ చేశారు.

ఆరుగాలం కష్టపడి తీరా పంట చేతికొచ్చే సమయానికి అతివృష్టి, అనావృష్టి, వరదలు, కరవు కాటకాలు, చీడపీడలు ఇతర ప్రకృతి వైపరీత్యాలతో కలిగే పంట దిగుబడి నష్టాలతో కుదేలవుతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది. పాదయాత్రలో రైతుల కష్టాలు, కడగండ్లు స్వయంగా చూశానని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రైతులకు ఉచిత పంటల బీమాను అందిస్తున్నామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులపై పైసా కూడా భారం లేకుండా పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు.

గతంలో కేవలం 20 లక్షల మంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ పరిధిలో ఉండగా, ఇప్పుడు 57 లక్షల మంది రైతులు పంటల బీమా పథకంలో నమోదయ్యారని చెప్పారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కోటి 14 లక్షల ఎకరాలను బీమా పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. భూమి సాగు చేస్తూ ఈ–క్రాప్‌లో రైతులు నమోదు చేసుకున్న ప్రతి ఎకరాన్ని పంటల బీమా పరిధిలో చేర్చి, రైతుల తరపున బీమా ప్రీమియమ్‌ను ప్రభుత్వమే చెల్లిస్తూ వైఎస్ఆర్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 2 =