ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి 25 మంది మృతి – ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా

PM Modi Announces Rs 2 Lakh Ex-gratia For The Families of 25 Pilgrims Lost Lives in Bus Falls into Gorge at Uttarakhand, Modi Announces Rs 2 Lakh Ex-gratia For The Families of 25 Pilgrims Lost Lives in Bus Falls into Gorge at Uttarakhand, Bus accident in Uttarakhand, 25 Killed as Bus Falls Into Gorge, Bus Falls Into Gorge in Uttarakhand, Uttarkashi bus accident, Uttarakhand bus accident, Ex-gratia For The Families of 25 Pilgrims Lost Lives in Bus Falls into Gorge at Uttarakhand, 2 Lakh Ex-gratia For The Families of 25 Pilgrims Lost Lives in Bus Falls into Gorge at Uttarakhand, Uttarakhand bus accident News, Uttarakhand bus accident Latest News, Uttarakhand bus accident Latest Updates, Uttarakhand bus accident Live Updates, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

ఉత్తరాఖండ్‌లో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం సంభవించింది. గంగోత్రి-యమునోత్రి జాతీయ రహదారిపై వెళ్తున్న చార్‌ధామ్‌ యాత్రికుల బస్సు దమ్టా వద్ద రోడ్డు పక్కన లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 25 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 5 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కాగా యాత్రికులంతా మధ్యప్రదేశ్‌కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి

ఈ దుర్ఘటనపై బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, అలాగే గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్ లో పేర్కొంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రమాదంలో మరణించిన వారి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పరిస్థితిపై ప్రధానికి, హోంమంత్రికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలను గురించి తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + twenty =