భారత్‌లోని ఆశా వర్కర్లకు డబ్ల్యూహెచ్‌వో ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్‌ హెల్త్‌ లీడర్స్‌’ పురస్కారం.. అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

WHO Honours Indian ASHA Workers with Prestigious Global Health Leaders Award PM Modi Expresses Delight, WHO Honours Indian ASHA Workers with Prestigious Global Health Leaders Award, PM Modi Expresses Delight, WHO Honours Indian ASHA Workers, Prestigious Global Health Leaders Award, Indian ASHA Workers, World Health Organization, World Health Organization Honours Indian ASHA Workers with Prestigious Global Health Leaders Award PM Modi Expresses Delight, Global Health Leaders Award, ASHA Workers, WHO, Indian ASHA Workers News, Indian ASHA Workers Latest News, Indian ASHA Workers Latest Updates, Indian ASHA Workers Live Updates, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) భారతదేశం లోని 10 లక్షల మంది మహిళా ఆశా వాలంటీర్లను సత్కరించింది. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో వారు చేసిన సేవలను గుర్తించిన డబ్ల్యూహెచ్‌వో వారికి ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్‌ హెల్త్‌ లీడర్స్‌’ పురస్కారాన్ని అందజేసింది. ఆశా వర్కర్లు భారత ప్రభుత్వం యొక్క అనుబంధ ఆరోగ్య కార్యకర్తలుగా అన్ని రాష్ట్రాలలో విరివిగా సేవలందిస్తున్నారు. వీరు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను భారతదేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలలో సైతం ప్రజల కోసం అందిస్తున్నారు. కాగా ఆశా వర్కర్లకు డబ్ల్యూహెచ్‌ఓ ‘గ్లోబల్ హెల్త్ లీడర్స్’ అవార్డు లభించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో వెళ్లి హర్షం వ్యక్తం చేశారు. ‘ఆరోగ్యకరమైన భారతదేశానికి భరోసా ఇవ్వడంలో వారు ముందంజలో ఉన్నారు. వారి అంకితభావం మరియు సంకల్పం ప్రశంసనీయం’ అని పేర్కొన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క డైరెక్టర్-జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ప్రపంచ ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయడం, ప్రదర్శిత నాయకత్వం మరియు ప్రాంతీయ ఆరోగ్య సమస్యల పట్ల నిబద్ధత కోసం చేసిన విశిష్ట సహకారాన్ని గుర్తిస్తూ ఆరు అవార్డులను ప్రకటించారు. ఆరుగురు అవార్డు గ్రహీతలలో అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ వర్కర్స్ (ఆశా) ఉన్నారు. అవార్డు గ్రహీతలను డాక్టర్ టెడ్రోస్ స్వయంగా నిర్ణయించారు. ఇండియాలో ప్రసూతి సంరక్షణ, వ్యాధి నిరోధక టీకాలు, కమ్యూనిటీ హెల్త్ కేర్, చికిత్స, ఆరోగ్య ప్రమోషన్, పారిశుధ్యం మరియు ఆరోగ్యకరమైన జీవనంతో సహా ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలను అందించడంలో ఆరోగ్య కార్యకర్తలు చేస్తున్న కృషిని ఒక ప్రకటంలో ప్రశంసించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =