న్యూజిలాండ్‌తో ‘టై’గా ముగిసిన మూడో టీ20.. 1-0తో సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్

India Vs New Zealand 3Rd T20 Match Ends With Tie By Dls Due To Rain At Napier India Win The Series 1-0,Third T20 Ended In Tie,New Zealand Vs India, India Won The Series 1-0,Mango News,Mango News Telugu,India Win The Series 1-0,Napier Stadium,Nz Vs Ind,India Cricket Team,Newzealand Cricket Team,Indian Team Captain Hardik Pandya,Hardik Pandya,Newzealand Team Captain Kane Williamson,Kane Williamson,Ind Vs Nz Latest News And Updates

న్యూజిలాండ్‌తో జరిగిన చివరిదైన సిరీస్ నిర్ణయాత్మక 3వ టీ20 మ్యాచ్‌ ‘టై’గా ముగిసింది. నేపియర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 160 పరుగులను ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత జట్టు బ్యాటింగ్ 9 ఓవర్లు ముగిశాక మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో మ్యాచ్ మ్యాచ్ టైగా ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. ఇక వర్షం పడే సమయానికి భారత్ 9 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. అయితే డక్‌వర్త్ లూయిస్ ప్రకారం.. 9 ఓవర్లలో 76 పరుగులు చేసినట్లైతే భారత్ గెలిచి ఉండేది. కానీ ఒక్క పరుగు తక్కువ చేయడంతో టైగా ముగిసినట్లు ఇరు జట్ల కెప్టెన్లకు అంపైర్లు తెలియజేశారు.

161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (11), రిషబ్ పంత్ (11) మరోసారి తక్కువ స్కోర్లకే పరిమితమవగా రెండో మ్యాచ్ సెంచరీ హీరో సూర్యకుమార్ యాదవ్ కూడా (13) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఈ సమయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు (30) దీపక్ హుడా (9) సహకారం అందిస్తుండగా ఒక్కసారిగా వర్షం మొదలైంది. మ్యాచ్ నిలిచే సమయానికి భారత్ 75 పరుగులు చేయగలిగింది. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథి 2 వికెట్లు, ఆడమ్ మిల్నే 1 వికెట్ చొప్పున తీశారు. అంతకుముందు ఆ జట్టులో డెవోన్ కాన్వే (59), గ్లెన్ ఫిలిప్స్ (54) రాణించడంతో 160 పరుగులు చేసింది.

కాగా ఇక భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ చెరో 4 వికెట్లు పడగొట్టగా, హర్షల్ పటేల్ ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు కీలక వికెట్లతో మెరిసిన హైదరాబాదీ మహ్మద్ సిరాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ మ్యాచ్’ దక్కగా.. రెండవ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన టీమిండియా బ్యాటింగ్ సంచలనం సూర్యకుమార్ యాదవ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది సీరిస్’ అవార్డ్ దక్కింది. ఇక ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వగా, రెండవ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే వర్షం కారణంగా టీ20 మ్యాచ్ ఆగిపోయి టై కావడం టీమిండియాకు ఇదే తొలిసారి కావడం గమనార్హం. కానీ ఓవరాల్ గా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఇది మూడోసారి. ఇంతకుముందు రెండు మ్యాచ్‌లు ఇలా వర్షం కారణంగా టై అయ్యాయి. గతేడాది పసికూన దేశాలు నెదర్లాండ్స్-మలేషియా మరియు మాల్టా-మార్సా మధ్య జరిగిన మ్యాచ్‌లు టై అయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 6 =