130 కోట్ల మంది ప్రజలకు నేను ప్రధానమంత్రిని కాను, ప్రధాన్ సేవక్‌ని మాత్రమే – సిమ్లాలో ‘గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్‌’లో ప్రధాని మోదీ

PM Narendra Modi Participates Garib Kalyan Sammelan at Shimla Himachal Pradesh, PM Modi Participates Garib Kalyan Sammelan at Shimla Himachal Pradesh, Modi Participates Garib Kalyan Sammelan at Shimla Himachal Pradesh, Garib Kalyan Sammelan at Shimla Himachal Pradesh, PM Narendra Modi To Visit Shimla For Participating Garib Kalyan Sammelan on Today, Narendra Modi To Visit Shimla For Participating Garib Kalyan Sammelan on Today, PM Modi To Visit Shimla For Participating Garib Kalyan Sammelan on Today, PM Narendra Modi To Visit Shimla, PM Narendra Modi Participating In Garib Kalyan Sammelan on Today, Garib Kalyan Sammelan on Today, PM Modi To Visit Shimla, Garib Kalyan Sammelan, PM Modi Participating In Garib Kalyan Sammelan on Today, PM Modi Shimla Tour, PM Modi Shimla Tour News, PM Modi Shimla Tour Latest News, PM Modi Shimla Tour Latest Updates, PM Modi Shimla Tour Live Updates, Shimla, Himachal Pradesh, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

దేశంలోని 130 కోట్ల ప్రజలకు నేను ప్రధానమంత్రిని కాను, కేవలం ప్రధాన్ సేవక్‌ని అని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు మంగళవారం హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో పర్యటించిన ప్రధాని ‘గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్‌’ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానులు, జిల్లా ప్రధాన కార్యాలయాలు మరియు కృషి విజ్ఞాన కేంద్రాలలో నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తూ, ‘కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ 8 సంవత్సరాలు గడిచాయి. ఈ 8 ఏళ్లలో ఒక్కసారి కూడా నన్ను నేను ప్రధానిగా భావించలేదు. ప్రభుత్వ పత్రాలపై సంతకం చేసినప్పుడే నాకు ప్రధానమంత్రి బాధ్యత ఉంటుంది. కానీ ఆ ఫైల్ పక్కకు పోయిన వెంటనే, నేను ప్రధానమంత్రిని కాదు.. 130 కోట్ల మంది ప్రజలకు ప్రధాన్ సేవక్‌ని అని భావిస్తాను. నా జీవితంలో సర్వస్వం దేశం కోసమే, నా జీవితం కూడా ఈ దేశ ప్రజల కోసమే’ అని పేర్కొన్నారు. గతంలో.. బంధుప్రీతి, కుంభకోణాల గురించి చర్చలు జరిగేవి కానీ నేడు ప్రభుత్వ పథకాల ప్రయోజనాల గురించి చర్చలు జరుగుతున్నాయి. నేడు భారతదేశంలోని స్టార్టప్‌ల గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతున్నారు. ప్రపంచ బ్యాంకు కూడా భారతదేశం యొక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ గురించి మాట్లాడుతుందని తెలిపారు.

పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ సభ్యులు మరియు ఇతర ప్రజా ప్రతినిధుల సమక్షంలో ‘గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్’ ఈరోజు ప్రారంభమైంది. దీనిద్వారా కేంద్రం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల గురించి ఫీడ్‌బ్యాక్‌ను పొందే ప్రయత్నంలో ప్రజలతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యేలా ప్రజాప్రతినిధులను ప్రోత్సహిస్తోంది. కాగా హిమాచల్ ప్రదేశ్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం నాలుగో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ సొంత జిల్లా మండిలోని పడల్ మైదానంలో జరిగిన ర్యాలీలో ప్రసంగించేందుకు మోడీ చివరిసారిగా డిసెంబర్ 27న హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. అయితే ఈరోజు ‘గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్‌’ కార్యక్రమానికి ముందు సిమ్లాలో మోదీ మంగళవారం రోడ్‌ షో నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − eleven =