అరుణాచల్ ప్రదేశ్‌ లోని సైనిక శిబిరానికి ‘జనరల్ బిపిన్ రావత్’ పేరు పెట్టిన భారత సైన్యం

Indian Armys Kibithu Base in Arunachal Pradesh Renamed Late General Bipin Rawats Garrison, Kibithu Base Named After General Bipin Rawat, Kibithu Base in Arunachal Pradesh Named As Bipin Rawats Garrison, Bipin Rawats Garrison, Late General Bipin Rawat, Former Chief Of Army Staff Of The Indian Army, Mango News, Mango News Telugu, Bipin Rawat, General Bipin Rawat , Former Inidan Military Officer Bipin Rawat, General Bipin Rawat Garrison, Late General Bipin Rawat, Bipin Rawat, Indian Army Latest News And Live Updates

దేశంలోని మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా సేవలందించిన దివంగత జనరల్ బిపిన్ రావత్ గౌరవార్థం.. అరుణాచల్ ప్రదేశ్‌లోని కిబితులో ఉన్న సైనిక శిబిరానికి ‘జనరల్ బిపిన్ రావత్ మిలటరీ గారిసన్’ అని పేరు పెట్టారు. ఇక సైనిక శిబిరానికి పేరు మార్చే ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ బ్రిగేడియర్ బీడీ మిశ్రా (రిటైర్డ్) మరియు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ, దివంగత సిడిఎస్ కుమార్తెలతో పాటు సీనియర్ సైనిక మరియు పౌర ప్రముఖులు పాల్గొన్నారు. దీనిలో స్థానిక సాంప్రదాయ నిర్మాణ శైలిలో నిర్మించిన పెద్ద గేట్‌ను గవర్నర్ ప్రారంభించారు. అలాగే వాలాంగ్ నుండి కిబితు వరకు 22 కి.మీ రహదారిని కూడా సీఎం ఖండూ చేతులమీదుగా జనరల్ బిపిన్ రావత్ మార్గ్‌గా అంకితం చేశారు.

ఇక కిబితు అనేది అరుణాచల్ ప్రదేశ్ లోని లోహిత్ లోయ ఒడ్డున ఉన్న ఒక చిన్న కుగ్రామం, ఇది వాస్తవ నియంత్రణ రేఖకు దగ్గరగా ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడే జనరల్ బిపిన్ రావత్ తన బెటాలియన్ 5/11 గూర్ఖా రైఫిల్స్‌కు కల్నల్‌గా 1999-2000 వరకు నాయకత్వం వహించారు. అంతేకాకుండా లోహిత్ లోయ ఒడ్డున ఉన్న కిబితు యొక్క భద్రతా నిర్మాణాన్ని పటిష్టపరచడంలో కీలక సహకారం అందించారు. కాగా జనరల్ బిపిన్ రావత్ గత డిసెంబరులో తమిళనాడులో ఒక సైనిక హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆయనతో పాటు భార్య మధులికా రావత్, మరో 12 మంది సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇది దేశవ్యాప్తంగా అప్పట్లో సంచలనం సృషించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − five =