నేడు ఢిల్లీలో ‘గురునానక్’ 553వ జయంతి వేడుకలు, పాల్గొననున్న ప్రధాని మోదీ

PM Modi To Participate in 553rd Jayanti Celebrations of Guru Nanak in Delhi Today, Guru Nanak 553rd Jayanti Celebrations, Guru Nanak Jayanti Celebrations,Modi To Participate Guru Nanak Jayanti,Mango News,Mango News Telugu,Guru Nanak Jayanti, Guru Nanak Jayanti Celebrations In Delhi, Guru Nanak Jayanti Latest News And Updates, Guru Nanak Jayanti Celebrations, Guru Nanak Jayanti, 553rd Guru Nanak Jayanti, Guru Nanak, Guru Nanak Celebrations 553rd Jayanti

ఈరోజు సాయంత్రం ఢిల్లీలో తొలి సిక్కు గురువు ‘శ్రీ గురునానక్ దేవ్’ 553వ జయంతి వేడుకలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి 8 గంటలకు ఢిల్లీలోని లోధీ ఎస్టేట్‌ 95లో శ్రీ గురునానక్ దేవ్ జీ 553వ జయంతి వేడుకలు జరుగుతాయని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటనలో తెలిపింది. కాగా జాతీయ మైనారిటీ కమిషన్ చైర్‌పర్సన్ ఇక్బాల్ సింగ్ లాల్‌పురా నివాసంలో ఈ వేడుక జరుగనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం సభలో ప్రసంగించనున్నారు. ఇక గురునానక్ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గురునానక్ మహారాజ్ మానవజాతికి ప్రబోధించిన మార్గదర్శకాలు, విలువలు ఆచరణనీయమని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఆదివారం, 2,418 మంది సిక్కు యాత్రికుల ‘జాతా’ అట్టారీ-వాఘా సరిహద్దు ద్వారా పాకిస్తాన్‌కు బయలుదేరి గురునానక్ యొక్క ప్రకాష్ పురబ్‌ను నంకనా సాహిబ్‌లోని ఆయన జన్మస్థలంలో జరుపుకున్నారు. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం నుంచి ఈ జాతా బయలుదేరింది. ఈ జాతా పాకిస్థాన్‌లోని ఇతర చారిత్రక సిక్కుల పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించనుంది. కాగా భారతీయ యాత్రికులకు పాకిస్తాన్ ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ అదనపు కార్యదర్శి (పుణ్యక్షేత్రాలు) రాణా షాహిద్ సలీమ్ స్వగతం పలికారు. పాకిస్తాన్ సిక్కు గురుద్వారా పర్బంధక్ కమిటీ అధ్యక్షుడు కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఇక ఈ సంవత్సరం గురునానక్ జయంతి నవంబర్ 8న చంద్ర క్యాలెండర్ ప్రకారం, గురుపూరబ్ కార్తీక పూర్ణిమ రోజున జరుపుకుంటున్నారు. శ్రీ గురునానక్ దేవ్ జీ సిక్కు మత స్థాపకుడు. గురునానక్ 1469 ఏప్రిల్ 15న పాకిస్తాన్‌లోని రాయ్ భోయ్ కి తల్వాండీ గ్రామంలో జన్మించారు. దీనిని ఇప్పుడు నంకనా సాహిబ్ అని పిలుస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + ten =