ఫిబ్రవరి 27న కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటన, శివమొగ్గ విమానాశ్రయానికి ప్రారంభోత్సవం

PM Modi will Visit Karnataka on 27th February Will Inaugurate Shivamogga Airport, PM Modi Karnataka Visit, PM Modi Visit Karnataka, PM Modi Inaugurate Shivamogga Airport, Shivamogga Airport 27th February, Mango News, Mango News Telugu, Modi Bangalore Visit Today,How To Contact Pm Modi Directly,How To Contact Pm Modi Personally,How To Reach To Pm Modi,Modi Bangalore Visit Schedule,Modi Karnataka Visit Schedule,Modi Visit To Bangalore,Modi Visit To Karnataka 2023,Modi Visit To Karnataka Today,Pm Modi Direct Contact Number,Pm Modi Income,Pm Modi Live Today Timing,Pm Modi Personal Mobile Number,Pm Modi Speech In Karnataka,Pm Narendra Modi Movie,Pm Qualification Modi

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఎల్లుండి (ఫిబ్ర‌వ‌రి 27, సోమవారం) క‌ర్ణాట‌క‌ రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. సోమవారం ఉద‌యం 11:45 గంట‌ల‌కు ప్ర‌ధాని మోదీ ముందుగా శివ‌మొగ్గ ఎయిర్‌పోర్ట్‌ని ప‌రిశీలించి, ఆ త‌ర్వాత ప్రారంభోత్స‌వం చేయనున్నారు. అలాగే శివమొగ్గలో రూ.3,600 కోట్ల కంటే ఎక్కువ విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

దేశమంతటా ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరచడంపై ప్రధాని ఆలోచనకు అనుగుణంగా, శివమొగ్గ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో మరో ఊపు వస్తుందని పేర్కొన్నారు. దాదాపు రూ.450 కోట్లతో ఈ కొత్త విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. విమానాశ్రయంలోని ప్యాసింజర్ టెర్మినల్ భవనం గంటకు 300 మంది ప్రయాణీకులను నిర్వహించగలదు మరియు ఈ విమానాశ్రయం మల్నాడు ప్రాంతంలోని శివమొగ్గ మరియు ఇతర పొరుగు ప్రాంతాలకు కనెక్టివిటీ మరియు ప్రాప్యతను మెరుగుపరుస్తుందని చెప్పారు. అలాగే శివమొగ్గలో రెండు రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో శివమొగ్గ-షికారిపుర-రాణేబెన్నూరు కొత్త రైల్వే లైన్ మరియు కోటగంగూరు రైల్వే కోచింగ్ డిపో ఉన్నాయి.

శివమొగ్గ-షికారిపుర-రాణేబెన్నూరు కొత్త రైల్వే లైన్ రూ.990 కోట్లతో అభివృద్ధి చేయబడుతుందని మరియు బెంగళూరు-ముంబయి మెయిన్‌లైన్‌తో మల్నాడు ప్రాంతానికి మెరుగైన కనెక్టివిటీని అందిస్తుందన్నారు. శివమొగ్గ నుండి కొత్త రైళ్లను ప్రారంభించేందుకు మరియు బెంగళూరు, మైసూరులో నిర్వహణ సౌకర్యాలను తగ్గించడానికి శివమొగ్గ నగరంలోని కోటగంగూరు రైల్వే కోచింగ్ డిపోను రూ.100 కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. అనంతరం పలు రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులతో పాటుగా, ప్ర‌ధాన మంత్రి జ‌ల్ జీవ‌న్ మిష‌న్ కింద 950 కోట్ల రూపాయ‌ల కంటే ఎక్కువ విలువైన మల్టి-విలేజ్ ప‌థ‌కాల‌కు ప్రారంభోత్సవాలు, శంకుస్థాప‌న చేయనున్నారు. అలాగే శివమొగ్గ నగరంలో 895 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన 44 స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను కూడా ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =