రాజ్యసభలో 72 మంది ఎంపీల పదవీ విరమణ, ఎంపీల సేవలను ప్ర‌శంసిస్తూ ప్రధాని మోదీ ప్రసంగం

PM Narendra Modi Address During Farewell of 72 Rajya Sabha Members, Farewell of 72 Rajya Sabha Members, PM Narendra Modi, PM Narendra Modi farewell message To 72 Rajya Sabha Members, Prime Minister Narendra Modi bade farewell to 72 retiring members of Rajya Sabha, 72 retiring members of Rajya Sabha, bid farewell to its 72 retiring members with Prime Minister Narendra Modi, Rajya Sabha bids farewell to 72 retiring Members with Prime Minister Narendra Modi, Prime Minister Narendra Modi gave a warm farewell speech in Rajya Sabha for 72 members, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, 72 Rajya Sabha Members, Rajya Sabha Members Farewell, Rajya Sabha, Mango News, Mango News Telugu,

రాజ్యసభలో ఒకేసారిగా 72 మంది ఎంపీలు పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో 72 మంది సభ్యులకు వీడ్కోలు పలుకుతూ రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సభలో ప్రసంగించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తున్న రాజ్యస‌భ స‌భ్యులంద‌రి సేవలను ప్ర‌శంసించారు, అలాగే వారికి భ‌విష్య‌త్తుకు శుభాకాంక్ష‌లు తెలిపారు. పదవీ విరమణ పొందుతున్న సభ్యుల అనుభవానికి గల విలువను ప్రధాని గుర్తు చేశారు. సభ నుంచి ఈ సభ్యుల నిష్క్రమణతో, మిగిలిన సభ్యుల బాధ్యత పెరుగుతుందని, ఎందుకంటే వారు వెళ్తున్న సభ్యుల కథను ముందుకు తీసుకెళ్లవలసి ఉంటుందని అన్నారు.

దేశంలోని అన్ని ప్రాంతాల వారి మనోభావాలు, స్ఫూర్తి, బాధ మరియు పారవశ్యాన్ని ఈ సభ ప్రతిబింబిస్తుందని ప్రధాని అన్నారు. ఒక సభ్యునిగా మనం సభకు ఎంతో సహకారం అందిస్తామనేది నిజమే అయితే, ప్రతి రోజు అనేక విధాలైన భారతదేశ సమాజం యొక్క ప్రస్తుత మరియు వ్యవస్థలను అనుభూతి చెందడానికి సభ అవకాశం కల్పిస్తుంది కాబట్టి సభ కూడా ఎంపీలకు చాలా అందిస్తుంది ప్రధాని మోదీ అన్నారు. కొంతమంది సభ్యులు పదవీ విరమణ పొందుతున్నారు, అయితే వారు తమ గొప్ప అనుభవాన్ని దేశం నలుమూలలకు తీసుకెళ్తారని అన్నారు.

సభ్యులు తమ జ్ఞాపకాలను, అనుభవాలను భావి తరాలకు ఉపయోగకరమైన సూచనగా రాయాలని కూడా ప్రధాని సూచించారు. సభ్యులు వారి జ్ఞాపకాలను సంస్థాగత పద్ధతిలో దేశ అభివృద్ధికి ఉపయోగించవచ్చని చెప్పారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో ప్రజలను ప్రేరేపించాలని పదవీ విరమణ చేస్తున్న ఎంపీలను ప్రధాని మోదీ అభ్యర్థించారు. మరోవైపు ప్రస్తుతం పదవీ విమరణ చేస్తున్న 72 మందితో పాటు ఇప్పటికే పదవీ విరమణ చేసిన 19 మంది రాజ్యసభ ఎంపీలకు చైర్మన్ వెంకయ్య నాయుడు వీడ్కోలు విందు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఎంపీలకు మెమెంటోలను కూడా అందజేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =