దేశంలో 5G సేవలను ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Narendra Modi Launches 5G Services at 6th India Mobile Congress in Pragati Maidan New Delhi, Prime Minister Modi Launch 5G Services, 5G Services Launches In India , PM Modi Launching 5G Services, Mango News, Mango News Telugu, PM Narendra Modi To Launch 5G Services, India 5G Services, India 5G Network Launch , 5G Technology In India, PM Narendra Modi Launch 5G Services, India 5G Launching Services, India 5G Network, 5G Network, 5G Services In India, 5G Services Launch India, PM Narendra Modi, PM Narendra Modi Latest News And Updates

దేశంలో కొత్త సాంకేతిక శకం మొదలైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు అక్టోబర్ 1, శనివారం ఉదయం న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 5G సేవలను ప్రారంభించారు. ముందుగా ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) ఆరవ ఎడిషన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా 5G సేవల ప్రారంభానికి కూడా శ్రీకారం చుట్టారు. అనంతరం ప్రగతి మైదాన్‌లో 5G టెక్నాలజీ యొక్క సామర్థ్యాన్ని చూపించడానికి ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రధాని మోదీ వీక్షించి, 5G సేవలను స్వయంగా పరిశీలించారు. దేశంలోని మూడు ప్రధాన టెలికాం ఆపరేటర్లు 5G సేవల ప్రదర్శన ఏర్పాటు చేయగా, ఈ సందర్భంగా రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ 5G సేవల పనితీరు గురించి ప్రధానికి వివరించారు. దేశంలో ఢిల్లీ, బెంగళూరు, ముంబయి, పూణే, చెన్నై, హైదరాబాద్, కోల్ కతా, లక్నో, అహ్మదాబాద్, చండీ ఘర్, గాంధీ నగర్, జామ్ నగర్, గురుగ్రామ్ వంటి 13 నగరాల్లో 5G సేవలు ముందుగా అందుబాటులోకి రానున్నాయి.

5G టెక్నాలజీ సీమ్ లెస్ కవరేజ్, అధిక డేటా రేటు, తక్కువ జాప్యం మరియు అత్యంత విశ్వసనీయమైన కమ్యూనికేషన్‌లను అందించడంతో పాటుగా ఎనర్జీ ఎఫిసియన్సీ, స్పెక్ట్రమ్ ఎఫిసియన్సీ మరియు నెట్‌వర్క్ ఎఫిసియన్సీ పెంచనుంది. దేశంలో 5G సేవలను ప్రారంభించడం చాలా సంవత్సరాల తీవ్రమైన సన్నాహాలతో కూడుకుని ఉన్నదని కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇటీవలే 5G స్పెక్ట్రమ్ వేలం విజయవంతంగా నిర్వహించబడగా, రూ.1,50,173 కోట్ల స్థూల ఆదాయంతో టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు 51,236 MHz కేటాయించబడింది. ఐఓటీ, ఎం2ఎం, ఏఐ, ఎడ్జ్ కంప్యూటింగ్, రోబోటిక్స్ మొదలైన వాటి వినియోగ అవసరాలను తీర్చగల బలమైన 5G ఎకో సిస్టం యొక్క డిమాండ్‌ను వేలం సమీకరించిందని చెప్పారు.

దేశంలో 5G కొత్త ఆర్థిక అవకాశాలను మరియు సామాజిక ప్రయోజనాలను ఆవిష్కరించగలదని, ఇది భారతీయ సమాజానికి పరివర్తన శక్తిగా ఉండటానికి అవకాశం కల్పిస్తుందన్నారు. అలాగే ఇది దేశం అభివృద్ధికి సంప్రదాయ అడ్డంకులను అధిగమించడానికి, స్టార్టప్‌లు మరియు వ్యాపార సంస్థల ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, ‘డిజిటల్ ఇండియా’ విజన్‌ను ముందుకు తీసుకెళ్లడానికి సహాయపడుతుందని చెప్పారు. భారతదేశంపై 5G యొక్క సంచిత ఆర్థిక ప్రభావం 2035 నాటికి $450 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =