ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ : దేశంలో ప్రతి ఒక్కరికి హెల్త్ ఐడీ

Digital Health Mission, Digital Initiative In India Soon, Every Indian To Have Unique 14 Digital Health ID, Mango News, Modi launch Pradhan Mantri Digital Health Mission, Nationwide rollout of Pradhan Mantri Digital Health Mission, PM Digital Health Mission, PM Modi Launches PM Digital Health Mission, Pradhan Mantri Digital Health Mission, Prime Minister Of India, unique digital health ID

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనసుఖ్ మాండవీయా, సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముందుగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రాజెక్ట్ ను ఆగస్టు 15, 2020న ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రస్తుతం ఈ మిషన్ ను పుదుచ్చేరి, చండీగఢ్, దాద్రా అండ్ నగర్ హవేలి, లద్దాఖ్, అండమాన్ అండ్ నికోబార్, లక్ష్యదీప్ వంటి ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేయనున్నారు.

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా డేటా, సమాచారం మరియు మౌలిక సదుపాయాల సేవలను అందించడం ద్వారా అపరిమితమైన ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ను సృష్టించనున్నారు. దేశంలో పౌరుల ఆరోగ్యానికి సంబంధించిన వ్యక్తిగత భద్రత, గోప్యతకు భరోసా ఇస్తూ సమాచారాన్ని నమోదు చేయనున్నారు. దేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఐడీ నంబర్‌ (హెల్త్ ఐడీ) ను కేటాయించి, వ్యక్తిగత అప్లికేషన్ రికార్డ్‌లను లింక్ చేసి మొబైల్ అప్లికేషన్ సహాయంతో చూసుకునేలా ఏర్పాటు చేయనున్నారు. పూర్తి టెక్నాలజీ ఆధారంగా ఈ మిషన్‌ నడవనుంది. ఈ మిషన్ లో భాగంగా పౌరుల సమ్మతితోనే వారి ఆరోగ్య రికార్డుల యాక్సెస్ మరియు మార్పిడిని అనుమతించచనున్నారు

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, గత ఏడు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆరోగ్య సౌకర్యాలను బలోపేతం చేసే దిశగా నేడు మరో కొత్త దశలోకి ప్రవేశిస్తున్నామని అన్నారు. భారతదేశ ఆరోగ్య సౌకర్యాలలో విప్లవాత్మక మార్పును తీసుకువచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఈ మిషన్‌ ను ఈ రోజు ప్రారంభిస్తున్నామ చెప్పారు. 130 కోట్ల ఆధార్ నెంబర్లు, 118 కోట్ల మొబైల్ సబ్‌స్క్రైబర్లు, 80 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు, 43 కోట్ల జన్ ధన్ బ్యాంక్ అకౌంట్లు, ఇంత పెద్ద మౌలిక సదుపాయాలు ప్రపంచంలో ఎక్కడా లేవని ప్రధాని పేర్కొన్నారు. ఈ డిజిటల్ మౌలిక సదుపాయాలు రేషన్ నుండి అడ్మినిస్ట్రేషన్ ప్రతిదీ సాధారణ భారతీయుడికి వేగంగా మరియు పారదర్శకంగా అందిస్తున్నాయని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల డిజిటల్ హెల్త్ సోలుషన్స్ ను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తుందని తెలిపారు. ఈ మిషన్ ఆసుపత్రుల ప్రక్రియలను సరళీకృతం చేయడమే కాకుండా జీవన సౌలభ్యాన్ని కూడా పెంచుతుందని అన్నారు. దీని కింద ప్రతి పౌరుడు ఇప్పుడు డిజిటల్ హెల్త్ ఐడీని పొందుతారని మరియు వారి ఆరోగ్య రికార్డు డిజిటల్‌గా రక్షించబడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + ten =