గులాబ్ తుఫాన్ : మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున వెంటనే అందించాలి, సీఎం జగన్ ఆదేశాలు

CM YS Jagan held Video Conference with District Collectors, CM YS Jagan held Video Conference with District Collectors on Gulab Cyclone Situation, CM YS Jagan Video Conference With District Collectors, Cyclone Gulab, Cyclone Gulab News, Cyclone Gulab Updates, Gulab Cyclone, Gulab Cyclone Situation, Mango News, PM Modi Assures Support To Odisha Andhra, YS Jagan Video Conference on Gulab Cyclone

గులాబ్ తుఫాన్ ప్రభావం, తుఫాన్ అనంతర పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌ మాట్లాడుతూ, వర్షం తగ్గుముఖం పట్టగానే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున వెంటనే అందించాలని చెప్పారు. అలాగే వర్షం వలన ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు రూ.1000 చొప్పున, సహాయక శిబిరాల నుంచి బాధితులు వెళ్లేటప్పుడు కూడా కుటుంబాలకు రూ.1000 చొప్పున ఆర్థికసాయం చేయాలని చెప్పారు.

బాధితులకు సహాయం అందించే విషయంలో వెనకడుగు వేయొద్దని, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. అవసరమైన అన్నిచోట్లా సహాయక శిబిరాలను తెరవాలని, అక్కడ మంచి ఆహారంతో పాటుగా మంచి వైద్యం, రక్షిత తాగునీరు అందించాలన్నారు. ముంపు ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. మరోవైపు పంట నష్టంపై కూడా అంచనా వేసి రైతులకు సహాయం అందేలా చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 10 =