సోమనాథ్‌ ఆలయ సమీపంలో సర్య్కూట్ హౌస్.. నేడు ప్రారంభిచనున్న ప్రధాని మోదీ

Gujarat, Modi to Inaugurate New Circuit House Today, Modi to Inaugurate New Circuit House Today Near Somnath Temple, Narendra Modi to Inaugurate New Circuit House Today, New Circuit House Today Near Somnath Temple, PM Modi, PM Modi to inaugurate new Circuit House, PM Modi to inaugurate new circuit house near Somnath Temple, PM Modi To Virtually Inaugurate New Circuit House, pm narendra modi, PM Narendra Modi to inaugurate new Circuit House near Somnath Temple, PM Narendra Modi to Inaugurate New Circuit House Today Near Somnath Temple, PM Narendra Modi to Inaugurate New Circuit House Today Near Somnath Temple in Gujarat, Somnath Temple

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక కీలక ప్రాజెక్టును నేడు ప్రారంభించనున్నారు. తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సోమనాథ్ ఆలయానికి సమీపంలో రూ.30 కోట్లతో నిర్మించిన సర్క్యూట్ హౌస్‌ను ఈ రోజు ప్రారంభిస్తారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ సర్క్యూట్ హౌస్‌ను ప్రారంభిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. సోమనాథ్ ఆలయాన్ని దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ భవనం ఆలయానికి దూరంగా ఉండడంతో కొత్త సర్క్యూట్ హౌస్ అవసరం ఏర్పడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం.. కొత్త సర్క్యూట్ హౌస్‌ను రూ.30 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించింది. దీనిని సోమనాథ్ ఆలయానికి సమీపంలోనే సకల సౌకర్యాలతో నిర్మించింది. ఈ సర్క్యూట్ హౌస్‌లో లగ్జరీ, వీఐపీ, డీలక్స్ గదులు, కాన్ఫరెన్స్ రూమ్, ఆడిటోరియం హాల్ మొదలైన సౌకర్యాలన్నింటిని ఏర్పాటు చేశారు. ప్రతి గది నుంచి సముద్ర దృశ్యాలు కనిపించే విధంగా ల్యాండ్‌స్కేపింగ్ కూడా జోడించారు. వీఐపీలు, విదేశీ పర్యాటకులు సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన సమయంలో వారికి ఉపయోగపడేలా సకల సౌకర్యాలతో ఈ సర్క్యూట్ హౌస్‌ను నిర్మించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =